Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ నెక్సాన్.. ఏది బెస్ట్?
Mahindra XUV 3XO : మహింద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్.. ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? ఇక్కడ తెలుసుకోండి..
Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ఓతో.. భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న విపరీతమైన పోటీ.. మరింత పెరిగింది. ఈ కొత్త ఎస్యూవీ.. ఇప్పటికే మార్కెట్లో బెస్ట్ సెల్లర్‌గా ఉన్న టాటా నెక్సాన్‌కి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్: ధర..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్యూవీ ధర రూ .7.49 లక్షలు - రూ .15.49 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. మరోవైపు.. టాటా నెక్సాన్ ధర రూ. 8.15 లక్షల నుంచి రూ .15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.
అంటే.. నెక్సాన్‌తో పోలిస్తే మహీంద్రా కొత్త ఎస్యూవీ తక్కువ బేస్ ధరతో వస్తుంది. కానీ కొత్త ఎస్యూవీ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం.. టాటా మోడల్ కంటే ఖరీదైనది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్: డైమెన్షన్స్..
Mahindra XUV 3XO on road price Hyderabad : మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్యూవీ పొడవు 3,990 ఎంఎం, వెడల్పు 1,821 ఎంఎం, ఎత్తు 1,647 ఎంఎం. ఈ ఎస్యూవీ 2,600 ఎంఎం వీల్ బేస్‌తో వస్తుంది. ఇక టాటా నెక్సాన్ పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,805 ఎంఎం, ఎత్తు 1,620 ఎంఎం, వీల్‌బేస్ 2,498 ఎంఎంతో వస్తుంది.
అంటే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ.. నెక్సాన్ కంటే కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది. అయితే టాటా ఎస్యూవీ కంటే వెడల్పుగా ఉంటుంది. అలాగే, ఇది పొడవైన వీల్‌బేస్‌ని కలిగి ఉంది. అంటే టాటా నెక్సాన్‌తో పోలిస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని అర్థం.
ఇదీ చూడండి:- Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వేరియంట్లు- వాటి ధరలు..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్: స్పెసిఫికేషన్లు
Tata Nexon on road price Hyderabad : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రెండు వేర్వేరు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ 110 బీహెచ్పీ పవర్, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్ 128 బీహెచ్పీ పవర్- 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్లతో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్ 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ సీఆర్డీఈ యూనిట్ నుంచి ఎనర్జీ పొందుతుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, ఆరు-స్పీడ్ ఏఎంటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్పీ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలానే.. టాటా నెక్సాన్ కూడా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. నెక్సాన్లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118.2బీహెచ్పీ పవర్, 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113బీహెచ్పీ పవర్, 260ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా నెక్సాన్‌లో ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఆరు-స్పీడ్ ఏఎంటీ, ఏడు-స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ప్రస్తుతం సీఎన్జీ ఆప్షన్లో అందుబాటులో లేదు. త్వరలోనే ఇది లాంచ్ అవ్వొచ్చు!
సంబంధిత కథనం