Tata Nexon Dark editions : టాటా నెక్సాన్​ డార్క్​ ఎడిషన్​​ లాంచ్​.. హారియర్​, సఫారీ కూడా!-tata nexon nexon ev harrier safari dark editions launched ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Dark Editions : టాటా నెక్సాన్​ డార్క్​ ఎడిషన్​​ లాంచ్​.. హారియర్​, సఫారీ కూడా!

Tata Nexon Dark editions : టాటా నెక్సాన్​ డార్క్​ ఎడిషన్​​ లాంచ్​.. హారియర్​, సఫారీ కూడా!

Sharath Chitturi HT Telugu
Mar 04, 2024 03:47 PM IST

Tata Nexon dark edition launch : టాటా మోటార్స్​ సంస్థ మంచి జోరు మీద ఉంది! టాటా నెక్సాన్​, నెక్సాన్​ ఈవీ, హారియర్​, సఫారీ ఎస్​యూవీల డార్క్​ ఎడిషన్​ని ఒకేసారి లాంచ్​ చేసింది. వాటి ఫీచర్స్​, ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..

నాలుగు కార్లకు డార్క్​ ఎడిషన్​ని లాంచ్​ చేసిన టాటా మోటార్స్​..
నాలుగు కార్లకు డార్క్​ ఎడిషన్​ని లాంచ్​ చేసిన టాటా మోటార్స్​..

Tata Harrier dark edition : టాటా మోటార్స్ తన ఫ్లాగ్​షిప్​ ఎస్​యూవీలైన.. నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీలకు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని గతేడాది లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఈ ఎస్​యూవీలకు డార్క్ ఎడిషన్​ని లాంచ్​ చేసింది. ఈ నాలుగు ఎస్​యూవీల ఎక్స్​షోరూం ధరలు.. రూ .11.45 లక్షలు- రూ .20.69 లక్షల మధ్యలో ఉంటాయి. నాలుగు ఎస్​యూవీలు ఆల్- బ్లాక్ ఎక్స్​టీరియర్ థీమ్ తో వస్తున్నాయి. లుక్స్​ మాత్రం చాలా బోల్డ్​గా ఉన్నాయి.

టాటా ఎస్​యూవీలకు డార్క్​ ఎడిషన్స్​..

డార్క్ ఎడిషన్ మోడళ్లను టాటా మోటార్స్ మొదటిసారిగా 2019లో ప్రవేశపెట్టింది. నాడు.. హారియర్ ఎస్​యూవీకి డార్క్​ ఎడిషన్​ తీసుకొచ్చింది. తరువాతి రెండేళ్లలో సఫారీ, నెక్సాన్ ఎస్​యూవీలు వంటి ఇతర మోడళ్లకు కూడా డార్క్​ థీమ్​ని తీసుకొచ్చింది. డార్క్ ఎడిషన్ ఇప్పుడు టాటా మోటార్స్​కి ఒక సిగ్నేచర్​గా మారింది.

మోస్ట్​ అఫార్డిబుల్​ టాటా డార్క్ ఎడిషన్ ఎస్​యూవీ నెక్సాన్​దే! దీని ప్రారంభ ధర రూ .11.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎక్స్​టీరియర్​లోని మార్పులన్నీ బ్లాక్ అవుట్ అలాయ్​ వీల్స్, డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్​తో కాస్మొటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎస్​యూవీ ఇంటీరియర్​ను కూడా బ్లాక్ థీమ్​తో అలంకరించారు.

ఇదీ చూడండి:- New Cars launch in March: ఈ మార్చి నెలలో లాంచ్ కానున్న కొత్త కార్లు ఇవే..

'హిడెన్ టు లిట్' కెపాసిటివ్ టచ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, అమెజాన్ అలెక్సా, టాటా వాయిస్ అసిస్టెంట్ (ఆరు భాషల్లో 200కు పైగా వాయిస్ కమాండ్లు), వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నెక్సాన్ డార్క్ ఎడిషన్ దాని అన్ని వేరియంట్ల మధ్యలో ఉంటుంది. నెక్సాన్ ఎస్​యూవీ ధర రూ .8.15 లక్షల నుంచి ప్రారంభమై రూ .15.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Tata Nexon EV dark edition : నెక్సాన్ ఈవీ కూడా ఇలాంటి కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. ఇందులో ఆల్-బ్లాక్ లెథరెట్ సీట్లు, డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్స్ ఉన్నాయి. నెక్సాన్ ఈవీ డార్క్ ధర రూ .19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

హారియర్​.. సఫారీ..

హారియర్, సఫారీ డార్క్ ఎడిషన్​ ఎస్​యూవీల్లో.. డార్క్ ఎడిషన్ లోగోలతో పాటు బోల్డ్ ఒబెరాన్ బ్లాక్ ఎక్స్​టీరియర్స్, బ్లాక్ స్టోన్ ఇంటీరియర్ థీమ్​, పియానో బ్లాక్ యాక్సెంట్​లతో వస్తున్నాయి. కేబిన్​లోని హెడ్​రెస్ట్​లపైనా డార్క్ బ్యాడ్జింగ్ ఉంటుంది. హారియర్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ .19.99 లక్షలు. ఇక సఫారీ డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ .20.69 లక్షలు.

టాటా నెక్సాన్​ సేఫ్టీకి 5 స్టార్​ రేటింగ్​..!

క్రాష్ టెస్ట్​లో నెక్సాన్ ఫేస్​లిఫ్ట్ 5 స్టార్ రేటింగ్​ను సాధించినట్లు గ్లోబల్ ఎన్సీఏపీ ఇటీవలే ప్రకటించింది. ఈ సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్​యూవీ అడల్ట్​ సేఫ్టీకి సంబంధించి 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు, చైల్డ్​ సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 44.52 పాయింట్లు సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం