Tata Nexon: టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కు గ్లోబల్ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్
Tata Nexon NCAP crash test: సేఫ్టీలో తిరుగులేదని టాటా నెక్సాన్ మరోసారి నిరూపించుకుంది. టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లేటెస్ట్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధించింది.
Tata Nexon 5 star safety rating: క్రాష్ టెస్ట్ లో నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 5 స్టార్ రేటింగ్ ను సాధించినట్లు గ్లోబల్ ఎన్సీఏపీ (Global NCAP) ఇటీవల ప్రకటించింది. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్ యూవీ పెద్దల సేఫ్టీకి సంబంధించి 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు, బాలల రక్షణలో 49 పాయింట్లకు గాను 44.52 పాయింట్లు సాధించింది. 2018 లో కూడా గ్లోబల్ ఎన్సీఏపీ (Global NCAP) క్రాష్ టెస్ట్ లో టాటా నెక్సాన్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన మొదటి భారతీయ కారు గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
సంపూర్ణంగా సురక్షితమైన కారు
టాటా నెక్సాన్ (Tata Nexon) లో బాడీషెల్ ఇంటిగ్రిటీ, ఫుట్ వెల్ ప్రాంతం సురక్షితంగా ఉన్నాయని గ్లోబల్ ఎన్సీఏపీ నివేదించింది. ‘‘నెక్సాన్ లో సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ డోర్లు కూడా ఉన్నాయి. డ్రైవర్, ప్రయాణికుడి తల, మెడకు కల్పించిన రక్షణ బాగుంది. డ్రైవర్, ప్రయాణికుడి ఛాతీలకు తగిన రక్షణ లభించింది. డ్రైవర్, ప్యాసింజర్ మోకాళ్లకు మంచి రక్షణ లభించింది. డ్రైవర్ టిబియాలు తగిన రక్షణను చూపించాయి. ప్రయాణీకుల టిబియాలు మంచి రక్షణను చూపించాయి’’ అని గ్లోబల్ ఎన్సీఏపీ వెల్లడించింది.
ఆల్ సీట్స్ సీట్ బెల్ట్ రిమైండర్
‘‘సైడ్ ప్రొటెక్షన్ పరంగా తల, పొత్తికడుపు, కటి భాగాలకు మంచి రక్షణ, ఛాతీకి తగిన రక్షణ కనిపించిందని టాటా నెక్సాన్ సైడ్ పోల్ ప్రభావాన్ని గ్లోబల్ ఎన్సీఏపీ వివరించింది. ఈ సైడ్ పోల్ క్రాష్ లో తల, కటికి మంచి రక్షణ, ఛాతీకి స్వల్ప రక్షణ, ఉదరానికి తగిన రక్షణ ఉన్నాయి. పాదచారుల రక్షణ కొరకు నెక్సాన్ UN127 మరియు GTR9 ప్రామాణికాలను కలిగి ఉంది. ఈ మోడల్ గ్లోబల్ ఎన్సీఏపీ ఈఎస్సీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ టాటా నెక్సాన్ లో అన్ని సీట్లలోని ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించేలా రిమైండర్లను కలిగి ఉంది.
6 ఎయిర్ బ్యాగులు
ఫీచర్ల విషయానికొస్తే నెక్సాన్ లో 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ మౌంట్స్, రేర్ పార్కింగ్ సెన్సార్లు, టిల్ట్ అండ్ క్రాకబుల్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. ప్రస్తుతానికి, అన్ని టాటా ఎస్ యూవీలకు క్రాష్ టెస్ట్ లలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మోహన్ సావర్కర్ మాట్లాడుతూ, ‘‘భద్రత మా డిఎన్ఎలో నిక్షిప్తమై ఉంది. మెరుగైన 2022 ప్రోటోకాల్ ప్రకారం కొత్త నెక్సాన్ కోసం గ్లోబల్ ఎన్సీఏపీ నుండి ప్రతిష్టాత్మక 5-స్టార్ రేటింగ్ పొందడం మాకు గర్వంగా ఉంది. ఇది 2018 లో జిఎన్సీఏపీ నుండి 5 స్టార్ రేటింగ్ పొందిన భారతదేశంలో మొదటి కారు టాటా నెక్సాన్. ఈ వారసత్వాన్ని మేం నిలబెట్టుకుంటాం’’ అన్నారు.
టాపిక్