Tata Nexon EV : టాటా నెక్సాన్​ ఈవీపై క్రేజీ డిస్కౌంట్స్​- రూ. 1 లక్ష తగ్గింపు!-automobile news tata nexon ev available with 1 lakh discounts check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Ev : టాటా నెక్సాన్​ ఈవీపై క్రేజీ డిస్కౌంట్స్​- రూ. 1 లక్ష తగ్గింపు!

Tata Nexon EV : టాటా నెక్సాన్​ ఈవీపై క్రేజీ డిస్కౌంట్స్​- రూ. 1 లక్ష తగ్గింపు!

Sharath Chitturi HT Telugu
Feb 09, 2024 06:19 AM IST

Tata Nexon EV price : టాటా నెక్సాన్​ ఈవీ కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇదే రైట్​ టైమ్​! ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై భారీ డిస్కౌంట్స్​ని ప్రకటించింది సంస్థ. ఆ వివరాలు..

టాటా నెక్సాన్​ ఈవీపై క్రేజీ డిస్కౌంట్స్​- రూ. 1 లక్ష తగ్గింపు!
టాటా నెక్సాన్​ ఈవీపై క్రేజీ డిస్కౌంట్స్​- రూ. 1 లక్ష తగ్గింపు!

Tata Nexon EV on road price in Hyderabad : దేశంలో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. చాలా మంది ఇప్పుడు ఈవీని కొనాలని చూస్తున్నారు. వీరిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమే! దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. తన ఎలక్ట్రిక్​ వెహికిల్​ పోర్ట్​ఫోలియోలోని టాటా నెక్సాన్​ ఈవీపై భారీ డిస్కౌంట్స్​ని ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో.. ఈ వెహికిల్​పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును ఇస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా నెక్సాన్​ ఈవీపై భారీ డిస్కౌంట్స్​..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వెహికిల్​ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​. 80శాతం కన్నా ఎక్కువ మార్కెట్​ షేర్​ ఈ కంపెనీ సొంతం. ఇందులో కీలక పాత్ర పోషించిందే.. టాటా నెక్స్​ ఈవీనే. మరి ఈ ఈవీని మీరు కొనాలని చూస్తుంటే.. ఇదే రైట్​ టైమ్​!

Discounts on Tata Nexon EV : ఎంవై-2023 నెక్సాన్​ ఈవీ స్టాక్​పై క్యాష్​ ఆఫర్స్​, ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ బోనస్​, డీలర్​ ఎండ్​ ఆఫర్స్​ని ఇస్తూ.. రూ. 1లక్ష వరకు తగ్గింపును ఇస్తోంది టాటా మోటార్స్​. అయితే.. ఇది వేరియంట్​ బట్టి మారుతూ ఉంటుంది. టాటా నెక్సాన్​ ఈవీ ఎస్​యూవీ లాంగ్​ రేంజ్​ వర్షెన్​పై అత్యధికంగా రూ. 1లక్ష తగ్గింపు కనిపిస్తోంది.

టాటా నెక్సాన్​ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్​లు ఉంటాయి. అవి 30 కేడబ్ల్యూహెచ్​, 40.5 కేడబ్ల్యూహెచ్​. వీటి రేంజ్​ వరుసగా 325 కి.మీలు, 465 కి.మీలు.

లాంగ్​ రేంజ్​ టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో సింగిల్​ మోటార్​ సెటప్​ ఉంటుంది. ఇది.. 143 హెచ్​పీ పవర్​ని, 215 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 10శాతం నుంచి 100శాతం ఛార్జింగ్​కి 6 గంటల సమయం పడుతుంది. 7.2 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ వస్తుంది.

Tata Nexon EV mileage : టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​కి ఇప్పటికే మంచి డిమాండ్​ ఉంది. ఇక రూ. 1లక్ష డిస్కౌంట్​ అంటే.. ఈ డిమాండ్​కు క్రేజ్​ మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.

మరి మీరు కూడా మంచి ఈవీని కొనాలని చూస్తుంటే.. టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఓసారి పరిశీలించండి. డిస్కౌంట్స్​కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు.. మీ సమీపంలోని డీలర్​షిప్​ షోరూమ్​కు వెళ్లండి.

టాటా నెక్సాన్​ ఈవీపై టాటా మోటార్స్​ ప్రకటించింది ఈ డిస్కౌంట్స్​.. కేవలం ఫిబ్రవరి నెలలోనే అమల్లో ఉంటాయి. ఈలోపు కొనుక్కుంటేనే, మీకు బెనిఫిట్స్​ ఉంటాయని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం