తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv 3xo Vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

05 May 2024, 10:32 IST

google News
    • మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ మారుతీ సుజుకీ బ్రెజా.. ఏది బెస్ట్​? స్పెసిఫికేషన్స్​, ఇంజిన్​, ధర వివరాలను ఇక్కడ చెక్​ చేయండి..
ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..
ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​తో.. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే ఉన్న విపరీతమైన పోటీ.. మరింత పెరిగింది. మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా అడుగుపెట్టిన ఈ కొత్త ఎస్​యూవీపై కస్టమర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ మోడల్​.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న మారుతీ సుజుకీ బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ. మారుతీ సుజుకీ బ్రెజాకు గట్టి పోటీ ఇస్తుందని టాక్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ మారుతీ సుజుకీ బ్రెజా: ధర

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఎస్​యూవీ ధర రూ .7.49 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. మారుతీ సుజుకీ బ్రెజా ధర రూ .8.34 లక్షల నుంచి రూ .13.98 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

అంటే.. ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ బేస్ వేరియంట్​తో పోలిస్తే బ్రెజా తక్కువ బేస్ ధరతో వస్తుంది. అయితే దాని టాప్ వేరియంట్ కూడా.. మహీంద్రా ఎస్​యూవీ టాప్ వేరియంట్ కంటే చౌకగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ మారుతీ సుజుకీ బ్రెజా: స్పెసిఫికేషన్లు..

Mahindra XUV 3XO on raod price Hyderabad : సరికొత్త మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్​యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రెండు వేర్వేరు పెట్రోల్, సింగిల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్​లో వస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ 110 బీహెచ్​పీ పవర్​ని, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ యూనిట్ 128 బీహెచ్​పీ పవర్​, 230 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్​యూవీ పెట్రోల్ వేరియంట్లలో 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. డీజిల్ వేరియంట్ 1.2-లీటర్ టర్బోఛార్జ్​డ్​ సీఆర్​డీఐ యూనిట్​తో పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​, 6-స్పీడ్ ఏఎంటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్​పీ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Maruti Suzuki Brezza on road price Hyderabad : మరోవైపు, మారుతీ సుజుకీ బ్రెజా.. పెట్రోల్ హైబ్రిడ్, పెట్రోల్-సీఎన్​జీ ఆప్షన్స్​లో లభిస్తుంది. పెట్రోల్, సీఎన్​జీ ఉండే 1.5-లీటర్ ఇంజిన్​తో నడిచే ఈ ఎస్​యూవీ 5-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ట్రాన్స్​మిషన్​ ఎంపికలను పొందుతుంది. ఎస్​యూవీ పెట్రోల్ హైబ్రిడ్ వర్షెన్​లోని ఇంజిన్.. 101బీహెచ్​పీ పవర్, 136.8ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎస్​యూవీ పెట్రోల్ సీఎన్​జీ వెర్షన్ 99బిహెచ్ పీ పవర్, 136ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ మోడ్​లో.. ఇది 86 బీహెచ్​పీ పీక్​ పవర్​, 121.5 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది.

తదుపరి వ్యాసం