December car launches : డిసెంబర్లో లగ్జరీ కార్ల లాంచ్.. 2022కు గ్రాండ్‌గా ముగింపు!
28 November 2022, 11:22 IST
- December car launches list : బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ నుంచి మొత్తం మీద నాలుగు వాహనాలు.. వచ్చే నెలలో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..
డిసెంబర్లో లగ్జరీ కార్ లాంచ్‌ల హవా..!
December car launches list : ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు ఆటో సంస్థలు సిద్ధపడుతున్నాయి. డిసెంబర్లో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా.. వచ్చే నెలలో లగ్జరీ కార్ల సెగ్మెంట్ కళకళలాడనుంది! బీఎండబ్ల్యూ నుంచి మెర్సిడెస్ బెంజ్ వరకు.. లాంచ్‌కు సిద్ధమవుతున్న కార్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..
బీఎండబ్ల్యూ ఎక్స్ఎం..
BMW XM launch : అంతర్జాతీయంగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్స్ఎం మోడల్‌ను ఆవిష్కరించింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం.. డిసెంబర్ 10న ఇండియాలో లాంచ్కానుంది. ఎం డివిజన్ నుంచి వస్తున్న బీస్పోక్ మోడల్ ఇది.
ప్లగ్-ఇన్ హైబ్రీడ్ వర్షెన్ కలిగి ఉన్న తొలి ‘ఎం’ మోడల్‌గా ఈ వెహికిల్ గుర్తింపు పొందింది. ఈ లగ్జరీ ఎస్‌యూవీలో 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ఉంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ ఆప్షన్ కూడా ఉంది. ఐసీఈలో 483హెచ్‌పీ పవర్‌తో పాటు హైబ్రీడ్ ఇంజిన్‌లో 653 హెచ్‌పీ పవర్, 800ఎన్ఎం టార్క్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లో 194 హెచ్‌పీ పవర్ జనరేట్ అవుతుంది. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎంలో 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ సెటప్ ఉంది. ఇక ప్యూర్ ఈవీ మోడ్‌లో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ వెహికిల్ 80కి.మీల దూరం ప్రయాణించగలదని సంస్థ చెబుతోంది.
బీఎండబ్ల్యూ ఎక్స్7..
BMW X7 launch date : బీఎండబ్ల్యూ నుంచి మరో మోడల్ డిసెంబర్లో లాంచ్ కానుంది. అదే బీఎండబ్ల్యూ ఎక్స్7. ఈ ఎస్యూవీ.. డిసెంబర్ 10న మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ బీఎండబ్ల్యూ ఎక్స్7 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను ఆవిష్కరించింది సంస్థ. ఇందులో 14.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 12.3 ఇంచ్ ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్.
బీఎండబ్ల్యూ ఎక్స్7.. రెండు వేరియంట్లలో లభించనుంది. అవి.. ఎక్స్‌డ్రైవ్ 40ఐ, ఎక్స్‌డ్రైవ్ 30డీ. మొదటిది.. 380హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. అది 6 సిలిండర్ పెట్రోల్ వేరియంట్. ఇక రెండోది.. 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్. అది 352 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. రెండింటిలోనూ 48వీ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ. ఇందులో 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ..
Mercedes Benz EQB launch date in India : ఈక్యూసీ, ఈక్యూఎస్ మోడల్స్‌ను ఇప్పటికే లాంచ్ చేసి మెర్సిడెస్ బెంజ్.. ఈక్యూబీ వేరియంట్‌ను డిసెంబర్ 2న విడుదల చేయనుంది. ఫలితంగా ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ పోర్ట్‌ఫోలియో బలంగా మారింది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ.. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో.. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. డ్యూయెల్ మోటార్ 300 4మాటిక్ వేరియంట్.. 228 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. డ్యూయెల్ మోటార్ 350 4మాటిక్ గ్యూస్ వేరియంట్.. 292 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ రెండింట్లో.. ఏది ఇండియాలో లాంచ్ అవుతోందో వేచి చూడాలి.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్బీ..
Mercedes Benz GLB launch details : మెర్సిడెస్ బెంజ్ నుంచి డిసెంబర్లో లాంచ్ కానున్న మరో మోడల్ జీఎల్బీ. ఇది కూడా డిసెంబర్ 2నే లాంచ్ అవ్వనుంది. మెక్సికో నుంచి సీబీయూ(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్బీ.. ఇండియాలోకి రానుంది. జీఎల్ఎస్ తర్వాత వస్తున్న రెండో 7 సీటర్ మోడల్ ఇదే. 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వాయిస్ కమాండ్, పానారోమిక్ సన్‌రూఫ్, స్లైడింగ్ డ్యూయెల్ రో సీట్స్ ఉన్నాయి. ఈ లగ్జరీ ఎస్‌యూవీలో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ డీజిల్ మోటార్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్.. 163హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్.. 190హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
నవంబర్‌లో ఇవి..
నవంబర్‌లో పలు సంస్థలు.. తమ మోడల్స్‌తో కస్టమర్ల ముందుకు వచ్చాయి. జీప్ గ్రాండ్ చెరోకీ, బీవైడీ అట్టో 3 ఈవీ, ప్రవాగ్ డిఫై ఎలక్ట్రిక్ వంటి మోడల్స్ లాంచ్ అయ్యాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్.. నవంబర్ కార్ల లాంచ్‌లో హైలైట్‌గా నిలిచింది.