Mercedes Benz electric EQB launch : మెర్సిడెస్​ నుంచి మరో రెండు కార్లు.. లాంచ్​ ఎప్పుడంటే!-mercedes benz electric eqb to launch on december 2 check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mercedes Benz Electric Eqb To Launch On December 2, Check Full Details

Mercedes Benz electric EQB launch : మెర్సిడెస్​ నుంచి మరో రెండు కార్లు.. లాంచ్​ ఎప్పుడంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 07, 2022 10:14 PM IST

Mercedes Benz electric EQB launch date : మెర్సిడెస్​ బెంజ్​ఇండియా.. రెండు కార్లను ఒకేసారి లాంచ్​ చేయనుంది. వాటి వివరాలు, లాంచ్​ డేట్​లను ఇక్కడ తెలుసుకోండి.

మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూబీ
మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూబీ (HT AUTO)

Mercedes Benz electric EQB launch date : 7 సీటర్​ లగ్జరీ ఈవీని లాంచ్​ చేసేందుకు సిద్ధంగా ఉంది మెర్సిడెస్​ బెంజ్​ ఇండియా. ఈక్యూబీ ఈవీని డిసెంబర్​ 2న లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది. ఈవీ సెగ్మెంట్​లో మెర్సిడెస్​ బెంజ్​కు ఈ ఏడాదిలో ఇది మూడో లాంచ్​ కావడం విశేషం. ఇప్పటికే ఏఎంజీ ఈక్యూఎస్​ 53 4ఎంఏటీఐసీ+, ఈక్యూఎస్​ 580 4ఎంఏటీఐసీ మోడల్స్​ను విడుదల చేసింది. ఐసీఈ(ఇంటర్నల్​ కంబషన్​ ఇంజిన్)తో పాటు లగ్జరీ ఈవీని కలిపి మెర్సిడెస్​ బెంజ్​ లాంచ్​ చేస్తుండటం ఇదే తొలిసారి!

ట్రెండింగ్ వార్తలు

బుకింగ్స్​ షురూ..

మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూబీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో జీఎల్​బీ ఎస్​యూవీ కూడా డిసెంబర్​ 2నే లాంచ్​ కానుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్​ను కూడా ప్రారంభించింది మెర్సిడెస్​ బెంజ్​ ఇండియా. ఆన్​లైన్​లో లేదా సమీప డీలర్​షిప్​కు వెళ్లి ఈ వాహనాలను బుక్​ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక్కో వాహనానికి రూ. 1.5లక్షలను చెల్లించాల్సి ఉంటుంది.

Mercedes Benz GLB : ఇలా రెండు వాహనాలను ఒకేసారి లాంచ్​ చేసి.. ఇండియా మార్కెట్​పై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది మెర్సిడెస్​ బెంజ్​. అంతేకాకుండా ఎస్​యూవీ పోర్ట్​ఫోలియోను కూడా పెంచుకునేందుకు చూస్తోంది.

ఇండియాలో మెర్సిడెస్​ బెంజ్​కు చెందిన జీఎల్​ఎస్​ ఇప్పటికే మార్కెట్​లో ఉంది. ఇక కొత్త జీఎల్​బీకి.. 'మినీ జీఎల్​ఎస్​' అని పేరు ఉంది. జీఎల్​ఎస్​ తర్వాత.. ఇది రెండో 7 సీటర్​ ఎస్​యూవీగా నిలిచిపోనుంది. ఇక ఈక్యూబీ ఈవీతో ఇండియాలో మెర్సిడెస్​ బెంజ్​ ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియో కూడా పెరుగుతోంది. ఈ రెండు వాహనాలు యువత, కుటుంబాలను ఆకర్షిస్తాయని మెర్సిడెస్​ బెంజ్​ ఇండియా భావిస్తోంది.

Mercedes Benz electric EQB bookings : జీఎల్​బీ లాంచ్​తో.. ఇండియా లగ్జరీ ఆటోమోటివ్​ సెగ్మెంట్​లో అతిపెద్ద ఎస్​యూవీ పోర్ట్​ఫోలియో ఉన్న సంస్థగా మెర్సిడెస్​ బెంజ్​ నిలిచిపోనుంది. ఇప్పటికే ఈ సంస్థకు ఇండియాలో జీఎల్​ఏ నుంచి జీ- క్లాస్​ వరకు ఎస్​యూవీ మోడల్స్​ ఉన్నాయి.

ఈ రెండు వాహనాల ధరలు, ఫీచర్స్​ వంటి వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వీటి తోసం మెర్సిడెస్​ బెంజ్​ లవర్స్​ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు!

WhatsApp channel

సంబంధిత కథనం