BMW XM launch : వావ్​.. ఓకే రోజు 3 కార్లను లాంచ్​ చేయనున్న బీఎండబ్ల్యూ- ఎప్పుడంటే!-bmw xm x7 facelift updated m 340i launch in india on december 10 check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw Xm Launch : వావ్​.. ఓకే రోజు 3 కార్లను లాంచ్​ చేయనున్న బీఎండబ్ల్యూ- ఎప్పుడంటే!

BMW XM launch : వావ్​.. ఓకే రోజు 3 కార్లను లాంచ్​ చేయనున్న బీఎండబ్ల్యూ- ఎప్పుడంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 01:59 PM IST

BMW XM launch in India : లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియాలో ఒకేసారి 3 కార్లను లాంచ్​ చేయనుంది. ఆ వివరాలు..

వావ్​.. ఓకే రోజు 3 కార్లను లాంచ్​ చేయనున్న బీఎండబ్ల్యూ
వావ్​.. ఓకే రోజు 3 కార్లను లాంచ్​ చేయనున్న బీఎండబ్ల్యూ

BMW XM launch in India : బీఎండబ్ల్యూ ప్రేమీకులకు అదిరిపోయే వార్త! ఈ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ.. ఇండియాలో ఒకే రోజు మూడు కార్లను లాంచ్​ చేయనుంది. బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం, బీఎండబ్ల్యూ ఫేస్​లిఫ్ట్​ ఎక్స్​7, బీఎండబ్ల్యూ ఎం 340ఐలు.. డిసెంబర్​ 10న లాంచ్​ అవ్వనున్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం..

బీఎండబ్ల్యూ ఎం నుంచి వస్తున్న రెండో 'బీస్పోక్​' మోడల్​.. ఈ ఎక్స్​ఎం. బీస్పోక్​ మోడల్​ అంటే.. ప్రత్యేకంగా కొద్ది మంది కస్టమర్ల కోసమే రూపొందించే వాహనం అని అర్థం. ఇందులో ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ సిస్టెమ్​ ఉంటుంది. 4.4 లీటర్​ ట్విన్​ టర్బో వీ ఇంజిన్​తో​ ఈ ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ సిస్టెమ్​ కలిపి వస్తుంది. ఫలితంగా ఈ ఎస్​యూవీ.. 644బీహెచ్​పీ పవర్​, 800ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

BMW XM price : ఇందులో 25.7కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఆల్​ ఎలక్ట్రిక్​ డ్రైవింగ్​ మోడ్​లో.. ఈ వాహనం 88కి.మీలు ప్రయాణించగలదు. 0-100 కేఎంపీహెచ్​ను 4.3సెకన్లలో చేరుకోగలుగుతుంది ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం. దీని టాప్​స్పీడ్​ 250కేఎంపీహెచ్​.

బీఎండబ్ల్యూ ఫేస్​లిఫ్ట్​ ఎక్స్​7..

BMW X7 facelift model launch : ఇప్పటికే ఇండియన్​ మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఎక్స్​7కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తీసుకొస్తోంది బీఎండబ్ల్యూ. ఇది అంతర్జాతీయ మార్కెట్​లో ఇప్పటికే అందుబాటులో ఉంది. డిజైన్​లో స్వల్పంగా మార్పులు జరిగాయి. క్యాబిన్​ ఇంటీరియర్​లో కూడా పలు మార్పులు చేశారు. 14.9ఇంచ్​ సెంట్రల్​ టచ్​స్క్రీన్​, 12.3ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ అదనంగా ఇచ్చారు. డాష్​బోర్డు డిజైన్​ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది.

6సిలిండర్​ పెట్రోల్​, డీజిల్​, హబ్రీడ్​ ఇంజిన్​లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు బీఎండబ్ల్యూ అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తాయి.

బీఎండబ్ల్యూ ఎం 340ఐలు..

BMW M 340i : ఇండియాలో ఒక బీఎండబ్ల్యూ మోడల్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లభిస్తుండటం ఇది తొలిసారి. అదే ఎం 340ఐ. అంతర్జాతీయ మార్కెట్​లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒరిజినల్​తో పోల్చుకుంటే దీని స్టైలింగ్​, టెక్నాలజీ మరింత పెరిగింది. ఇందులో 12.3ఇంచ్​ డిజిటల్​ గాజ్​ క్లస్టర్​, 14.9ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం