తెలుగు న్యూస్ / ఫోటో /
2023 BMW M2 unveiled : బీఎండబ్ల్యూ ఎం2.. అదిరిందిగా!
2023 BMW M2 unveiled : జర్మనీ లగ్జరీ కార్ బీఎండబ్ల్యూ.. సెకెండ్ జనరేషన్ ఎం2 వాహనాన్ని ఆవిష్కరించింది. ఇందులో ఆటోమేటిక్, మేన్యువల్ ఆప్షన్స్ ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
బీఎండబ్ల్యూ ఎం2ను ఆవిష్కరించారు. ఇందులో డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది.
(2 / 6)
ఈ కొత్త వాహనం.. 2002 టర్బో స్పోర్ట్స్ కూప్నకు, బీఎండబ్ల్యూ 1ఎంకు సక్సెసర్‌గా పిలుస్తున్నారు. ఇందులో ఎస్58 పవర్ యునిట్ ఉంది. 2.0 లీటర్ టర్బోఛార్జ్ ఇన్లైన్- 6 సిలిండర్ ఇంజిన్ దీని సొంతం. ఇది 453 బీహెచ్పీ, 550 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, లేదా 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇందులో ఉంటుంది.
(3 / 6)
మేన్యువల్ గేర్ బాక్స్‌లో.. 0-60ఎంపీహెచ్కి వెళ్లేందుకు 4.1 సెకన్లు పడుతుంది. అదే ఆటోమెటిక్లో అయితే 3.9సెక్లనే పడుతుంది. గంటకు 250కి.మీల వేగంతో ఈ బీఎండబ్ల్యూ ఎం2 ప్రయాణిస్తుంది.
(4 / 6)
ఈ బీఎండబ్ల్యూ ఎం2లో హారిజాంటల్ కిడ్నీ గ్రిల్.. ఫ్రంట్‌లో ఉంటుంది. స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. 19 ఇంచ్ ఫ్రంట్, 20 ఇంచ్ రేర్ వీల్స్ దీనికి ఉన్నాయి.
(5 / 6)
ఆల్పైన్ వైట్, సఫైర్ మెటాలిక్, బ్రోక్లీన్ గ్రే మెటాలిక్, టొరెంటో రెడ్ మెటాలిక్, న్యూ జాడ్వూర్ట్ బ్లూ రంగుల్లో ఈ బీఎండబ్ల్యూ ఎం2 వస్తోంది.
ఇతర గ్యాలరీలు