తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv700 Blaze Edition : మహీంద్రా ఎక్స్​యూవీ700 కొత్త ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Mahindra XUV700 Blaze Edition : మహీంద్రా ఎక్స్​యూవీ700 కొత్త ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

04 May 2024, 11:15 IST

    • Mahindra XUV700 Blaze Edition : మహీంద్రా ఎక్స్​యూవీ700 కొత్త ఎడిషన్​ లాంచ్ అయ్యింది. దీని పేరు ఎక్స్​యూవీ700 బ్లేజ్​ ఎడిషన్​. ఈ మోడల్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇదిగో.. మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్​ ఎడిషన్
ఇదిగో.. మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్​ ఎడిషన్

ఇదిగో.. మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్​ ఎడిషన్

Mahindra XUV700 Blaze Edition price : మహీంద్రా తమ పాప్యులర్ ఎస్​యూవీ.. మహీంద్రా ఎక్స్​యూవీ700లో కొత్త, స్పెషల్ ఎడిషన్​ను లాంచ్ చేసింది. బ్లేజ్ ఎడిషన్​గా పిలిచే దీని ఎక్స్​షోరూమ్ ధర రూ.24.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్లేజ్ ఎడిషన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లతో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ ఏటీ, డీజిల్ ఏటీ, ఎంటీ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంటుంది. 2024 మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కాస్మొటిక్ మార్పులతో మాత్రమే వస్తుంది. మహీంద్రా ఎస్​యూవీలో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు.

మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్​ ఎడిషన్​..

మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కొత్త మ్యాట్ బ్లేజ్ రెడ్ కలర్​లో నపోలీ బ్లాక్ హైలెట్స్​తో రూపుదిద్దుకుంది. కాబట్టి.. రూఫ్​, రేర్​ వ్యూ అద్దాలు, గ్రిల్, అల్లాయ్ వీల్స్ నల్లగా ఉంటాయి. ఇంటీరియర్​లో కూడా కొన్ని కాస్మొటిక్ మార్పులు ఉన్నాయి. క్యాబిన్ ఇప్పుడు నలుపు రంగులో ఉంటుంది. ఇది కొంచెం స్పోర్టీ అపీల్​ ఇస్తుంది.

ఇది కాకుండా, ఎక్స్​యూవీ700 బ్లేజ్ ఎడిషన్​లో ఎటువంటి మార్పులు లేవు. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 2.0-లీటర్ టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులోని పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 200బీహెచ్​పీ పవర్​ని, 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. డీజిల్ ఇంజిన్.. 184బిహెచ్​పీ పవర్, 450 ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్ బాక్స్ ఆప్షన్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎస్​యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి రూ.26.99 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.

మహీంద్రా ఎస్​యూవీల జోరు..

Mahindra XUV700 on road price Hyderabad : మహీంద్రా అండ్ మహీంద్రా 2024 ఏప్రిల్​లో భారత మార్కెట్లో మొత్తం 41,008 ఎస్​యూవీలను విక్రయించినట్లు ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ ట్రెండ్​కు అనుగుణంగా భారత ప్యాసింజర్ వాహన మార్కెట్.. ఎస్​యూవీల కోసం విపరీతమైన డిమాండ్​ ఎదుర్కొంటున్న సమయంలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజానికి ఈ అమ్మకాలు పెరిగడం విశేషం. ఎస్​యూవీ అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా అండ్​ మహీంద్రాగా మారింది పరిస్థితి.

యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 41,542 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్​లో సంస్థ తెలిపింది. రాబోయే నెలల్లో కూడా ఈ అమ్మకాల జోరును కొనసాగించాలని వాహన తయారీ సంస్థ భావిస్తోంది. అందుకోసం మహీంద్రా కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్​యూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ..

Mahindra XUV 3XO : గత కొన్ని రోజులుగా మహీంద్రా అండ్​ మహీంద్రా ఊరిస్తూ వస్తున్న మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ.. ఇండియా మార్కెట్​లో కొన్ని రోజుల క్రితం లాంచ్​ అయ్యింది. ఇది.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ధర రూ.7.49 లక్షల వద్ద ప్రారంభమై.. రూ. 15.49 లక్షల వరకు వెళుతుంది. ఇవి ఎక్స్​షోరూం ధరలు. లాంచ్​ నేపథ్యంలో.. ఈమహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ విశేషాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం