Affordable SUVs in India : ఎస్యూవీ కొనాలా? తక్కువ బడ్జెట్లో ఇవి బెస్ట్!
18 March 2024, 10:41 IST
- Top 3 Affordable SUVs in India : బడ్జెట్లో మంచి ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఇండియాలో బెస్ట్, అఫార్డిబుల్ ఎస్యూవీ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీలు ఇవే..
Budget friendly SUV cars in India under 7 lakh : ఇండియాలో ఇప్పుడు 'ఎస్యూవీ' ట్రెండ్ నడుస్తోంది! స్టైల్‌తో పాటు స్పేషియస్గా ఉంటున్న ఎస్‌యూవీలను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? కానీ.. మంచి ఎస్యూవీ కొనేందుకు సరైన బడ్జెట్ లేదని ఆగిపోతున్నారా? మరేం దిగులు లేదు! ఎస్యూవీ సెగ్మెంట్లో బీభత్సమైన పోటీ ఉండటంతో.. తక్కువ ధరకే మంచి వెహికిల్స్ లభిస్తున్నాయి. ఆ లిస్ట్‌ని మీకోసం మేము రూపొందించాము. లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి.
టాటా పంచ్ ఎస్యూవీ..
అఫార్డిబుల్, బెస్ట్ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఫిబ్రవరి నెలలో టాప్ 10 బెస్ట్ ఎస్‌యూవీల్లో నెంబర్ 1 ప్లేస్‌ని దక్కించుకుంది పంచ్. స్టైలిష్ డిజైన్‌తో పాటు డ్యూయెల్ టోన్ పెయింట్, ప్రొజెక్టర్ హాలోజెన్ హెడ్‌లైట్స్, మస్క్యూులర్ బానెట్, రూఫ్ రెయిల్స్, వైడ్ ఎయిర్ డ్యామ్ వంటివి వస్తున్నాయి. ఇందులో 15 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇక 5 సీటర్ స్పెషియస్ కేబిన్‌లో 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, స్టార్ట్/ స్టాప్ బటన్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, యాపిల్ కార్ప్లే, అండ్రాయిడ్ కార్ప్లే వంటివి ఫీచర్స్‌గా ఉన్నాయి.
Tata Punch on road price in Hyerabad : ఈ ఎస్‌యూవీలో.. 1.2 లీటర్ రివొట్రాన్, 3 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 84 బీహెచ్పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ టాటా పంచ్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6 లక్షలు.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ సైతం రెడీ అవుతుంది. ఇది 2025లో లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్టర్:-
2023లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్టర్కి మంచి స్పందన లభిస్తోంది. తక్కువ ధరకే, ఎక్కువ ఫీచర్స్ వస్తుండటం ఈ ఎస్యూవీ స్పెషాలిటీ. ఇందులో.. ప్రొజెక్టర్ హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, గ్లాస్ బ్లాక్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్ వంటివి వస్తున్నాయి. ఇందులో 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ ఉంటాయి.
Best SUV under 7 Lakh in India : ఇక హ్యుందాయ్ ఎక్స్టర్ స్పేషియస్ కేబిన్‌లో డ్యూయెల్ కెమెరాతో కూడిన డాష్‌క్యామ్, వాయిస్ ఎనేబుల్డ్ సన్‌రూఫ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్లు ఫీచర్స్‌గా వస్తున్నాయి.
ఈ హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీలో 1.2 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 88 హెచ్‌పీ పవర్‌ని, 113.8 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6.13 లక్షలు
సిట్రోయెన్ సీ3:-
Citroen C3 on road price in Hyderabad : ఇండియాలో సిట్రోయెన్ వెహికిల్స్‌కి డిమండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సిట్రోయెన్ సీ3 ఎస్యూవీ.. ఇక్కడ సంస్థకు బెస్ట్ సెల్లింగ్‌గా ఉంది. ఇందులో బంపర్ మౌంటెడ్ హెడ్‌లైట్స్, స్ల్పిట్ టైప్ డీఆర్ఎల్స్, స్లీక్ గ్రిల్, సిల్వర్డ్ రూఫ్ రెయిల్స్, వ్రాప్ అరౌండ్ టెయిల్‌లైట్స్ వస్తున్నాయి. 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ఎస్యూవీ కేబిన్ల టూ టోన్ డాష్‌బోర్డ్, కీలెస్ ఎంట్రీ, ఫ్రెంట్/ రేర్ యూసఎస్బీ పోర్ట్స్, 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
సిట్రోయెన్ సీ3 ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6.16 లక్షలు. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో 82 హెచ్‌పీ పవర్‌ని, 115 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 1.2 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజిన్.. 110 హెచ్‌పీ పవర్‌ని, 190 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.