Kia Clavis SUV : ఇండియాలోకి కియా కొత్త ఎస్యూవీ.. త్వరలోనే 'క్లావిస్' లాంచ్!
Kia Clavis SUV launch in India : ఇండియా కోసం ప్రత్యేకంగా ఓ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది కియా మోటార్స్. ఈ ఎస్యూవీ పేరు కియా క్లావిస్. ఇది త్వరలోనే లాంచ్ అవుతుందని సమాచారం.
Kia Clavis price in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఇక ఈ పోటీని మరింత పెంచేందుకు సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది కియా మోటార్స్. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ పేరు కియా క్లావిస్. ఇది.. సోనెట్, సెల్టోస్ లైనప్‌లో యాడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్ లాంచ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కియా క్లావిస్ లాంచ్ ఎప్పుడు?
ఈ ఏడాది చివర్లో.. క్లావిస్ ఎస్‌యూవీని కియా మోటార్స్ లాంచ్ చేయనుంది. 2025 తొలినాళ్లల్లో.. అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ మోడల్ వస్తుంది. ఆ వెంటనే.. ఇండియాలోకి కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ కియా క్లావిస్లో పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ వర్షెన్ అందుబాటులో ఉంటుందని సమాచారం. పెట్రల్ మోడల్ లాంచ్ అయిన 6 నెలలకు.. కియా క్లావిస్ ఈవీని కూడా విడుదల చేయాలని సంస్థ భావిస్తోందట.
ఇక ఈ ఎస్‌యూవీకి చెందిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చూస్తుంటే.. ఈ వెహికిల్ సైజు ఎక్కువగానే ఉంది! గ్రౌండ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంది. రగ్డ్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:- Hyundai Creta N Line : హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ లాంచ్.. ధర ఎంతంటే..
Kia Clavis SUV : ఇక కియా క్లావిస్లో ఫీచర్స్‌కి కొదవ ఉండదని సమాచారం. భారీ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, సన్‌రూఫ్‌తో పాటు ఇతర ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
సోనెట్‌తో పోల్చుకుంటే.. కియా క్లావిస్ ఇంటీరియర్‌లో స్పేస్ కాస్త ఎక్కువే ఉండొచ్చు! సోనెట్‌లో ఉన్న ఏకైక నెగిటివ్ విషయం స్పేస్!
ఈ కియా క్లావిస్ ఎస్యూవీ ఇంజిన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ.. పెట్రోల్, ఎలక్ట్రిక్ వర్షెన్లను ఒకటే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండూ.. ఫ్రెంట్- వీల్ డ్రైవ్ ఓన్లీ అని సమాచారం. ఇండియా కోసమే ఈ మోడల్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
కియా క్లావిస్ ఎస్యూవీ- ధర ఎంత ఉండొచ్చు?
Kia new SUV launch in India : ఇండియాలో కియా క్లావిస్ లాంచ్‌తో పాటు ధర వివరాలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ.. ఇది.. కియా సోనెట్ ధర కన్నా కాస్త ఎక్కువ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. ఇండియాలో కియా సోనెట్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలుగా ఉంది.
ఇండియాలో కియా మోటార్స్ వెహికిల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో కియా సెల్టోస్ ఒకటి. సోనెట్‌కి కూడా మంచి క్రేజ్ ఉంది. అటు.. ఈవీ సెగ్మెంట్‌పైనా సంస్థ ఫోకస్ చేసింది. రానున్న రోజుల్లో కియా ఈవీ9ని ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇక కియా క్లావిస్ ఎస్యూవీ పెట్రోల్, ఈవీ వర్షెన్లు అందుబాటులోకి వస్తే.. ఇండియాలో లాభాలు పెంచుకోవచ్చని సంస్థ భావిస్తోంది.
సంబంధిత కథనం