తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V30e Vs Vivo V30 : వివో వీ30ఈ వర్సెస్​ వివో వీ30.. ఏది కొంటే బెటర్​?

Vivo V30e Vs Vivo V30 : వివో వీ30ఈ వర్సెస్​ వివో వీ30.. ఏది కొంటే బెటర్​?

Sharath Chitturi HT Telugu

04 May 2024, 13:03 IST

  • Vivo V30e vs Vivo V30 : వివో వీ30ఈ వర్సెస్​ వివో వీ30.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

వివో వీ30ఈ వర్సెస్​ వివో వీ30..
వివో వీ30ఈ వర్సెస్​ వివో వీ30.. (Vivo)

వివో వీ30ఈ వర్సెస్​ వివో వీ30..

Vivo V30e price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో వరుస లాంచ్​లతో బిజీబిజీగా ఉంటోంది దిగ్గజ టెక్​ సంస్థ వివో. 2 నెలల ముందే వివో వీ30​ని లాంచ్​ చేసిన ఈ సంస్థ.. తాజాగా వీవో వీ30ఈని కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ రెండింట్లో ఏది కొనొచ్చు? ఏది వాల్యూ ఫర్​ మనీ బై అవుతుంది? ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

వివో వీ30ఈ వర్సెస్ వివో వీ30

డిస్ ప్లే: వివో వీ30, వివో వీ30ఈ.. రెండూ 6.78 ఇంచ్​ ఎఫ్​హెచ్​డీ + కర్వ్డ్ అమోలెడ్​ డిస్​ప్లే కలిగి ఉంటాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​ వీటి సొంతం. అయితే వివో వీ30ఈలో 2400 x 1080 పీ రిజల్యూషన్ ఉంటే.. వివో వీ30 లో 2800 x 1260 పీ ఫుల్ హెచ్​డీ + రిజల్యూషన్ ఉంటుంది. అందువల్ల వివో వీ30 మెరుగైన వ్యూయింగ్ ఎక్స్​పీరియన్స్​ని అందిస్తుంది.


Vivo V30e features : కెమెరా: డ్యూయెల్ కెమెరా సెటప్​తో కొత్తగా ప్రకటించిన వివో వీ30ఈ.. జెమ్ కట్ కెమెరా మాడ్యూల్​తో వస్తుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మరోవైపు, వివో వీ30 డ్యూయెల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఆటో-ఫోకస్, ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​లో 50 మెగా పిక్సల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

ప్రాసెసర్​: పనితీరు పరంగా ఈ రెండు స్మార్ట్​ఫోన్​లకు భారీ వ్యత్యాసం ఉంది. వివో వీ30ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్​తో పాటు 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. వివో వీ30 స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 7 జెన్ 3 చిప్సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. వివో వీ30 మరింత శక్తివంతమైన ప్రాసెసర్​ని కలిగి ఉంది. పైగా ఎక్కువ ర్యామ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు స్మార్ట్​ఫోన్లు పనిచేయనున్నాయి.

Vivo V30 price in India : బ్యాటరీ:వివో వీ30ఈ స్మార్ట్​ఫోన్​లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో వీ30 స్మార్ట్​ఫోన్​లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అందువల్ల, వివో వీ30ఈ బ్యాటరీ లైఫ్​.. వివో వీ30 కంటే కొంచెం ఎక్కువ. కానీ వివో వీ30కి వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ధర: చివరగా, వివో వీ30ఈ ప్రారంభ ధర రూ.27999. వివో వీ30 ప్రారంభ ధర రూ.33999.

తదుపరి వ్యాసం