తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphones Discounts: ఐ ఫోన్ 14 సహా ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్

Smartphones discounts: ఐ ఫోన్ 14 సహా ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్

HT Telugu Desk HT Telugu

20 April 2024, 19:37 IST

  • Smartphones discounts: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? 2024 ఏప్రిల్ నెలలో ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, వివో వంటి ప్రధాన బ్రాండ్ లు తమ ప్రీమియం రేంజ్ మోడళ్లపై ధరలను తగ్గించాయి. ఆ టాప్ డీల్స్ ఇక్కడ చూడండి.

స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్
స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ (Pexels)

స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

Smartphones discounts: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏప్రిల్ నెలలో వన్ ప్లస్, షియోమీ, ఆపిల్ వంటి ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ పాపులర్ ఫోన్ల ధరలను తగ్గించాలని నిర్ణయించారు. భారీ డిస్కౌంట్ లభించే స్మార్ట్ ఫోన్స్ ఇవే..

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

1. వన్ ప్లస్ 11 5జీ

వన్ ప్లస్ 11 5 జీ (OnePlus 11 5G) స్మార్ట్ ఫోన్ 2023 ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మోడల్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్, సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999 కాగా, ఇప్పుడు వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో, డిస్కౌంట్ అనంతరం కేవలం రూ.51,999 లకే లభిస్తుంది. ఈ వేరియంట్ ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

2.శాంసంగ్ గెలాక్సీ ఏ34

శాంసంగ్ గెలాక్సీ ఏ 35 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో ప్రవేశపెట్టిన వెంటనే శాంసంగ్ తన గెలాక్సీ ఏ 34 5జీ (Samsung Galaxy A34) మోడల్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. శాంసంగ్ ఇండియా వెబ్సైట్ లో ప్రస్తుతం గెలాక్సీ ఎ 34 5 జీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ రూ .24499 లకు లభిస్తుంది. మీకు ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అవసరమైతే, 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ. 26499 లకు లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ .32999.

3. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ (OnePlus Nord CE 3 5G) స్మార్ట్ ఫోన్ ధరను కూడా తగ్గించారు. గత సంవత్సరం జూలైలో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ను లాంచ్ చేశారు. ఈ 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ .24,999 లకు లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ .26,999. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 నుంచి రూ.27,999కు తగ్గింది.

4. వివో వై16

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన వివో వై16 (Vivo Y16) బేస్ మోడల్ ధర రూ.10,499 నుంచి రూ.9,999కు తగ్గింది. అదేవిధంగా 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.11,999 నుంచి రూ.10,999కు తగ్గింది. గతేడాది సెప్టెంబర్లో భారత్ లో లాంచ్ అయిన వివో వై16 స్మార్ట్ ఫోన్ లో హెచ్డీ+ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా తదితర ఫీచర్స్ ఉన్నాయి.

5.. ఐఫోన్ 14

ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) కూడా ఇప్పుడు ఆకర్షణీయమైన తగ్గింపుతో లభిస్తుంది.ఈ ఫోన్ ను 2022 లో లాంచ్ చేశారు. ఆపిల్ ఐ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 ఒరిజినల్ ధర రూ.79,900 కాగా, ఇప్పుడు అమెజాన్ లో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 21 శాతం డిస్కౌంట్ తో రూ.62,800 లకు లభిస్తుంది. అదనంగా, వినియోగదారులు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.

తదుపరి వ్యాసం