Vivo V30e launch: భారత్ లో వివో వీ30ఈ లాంచ్; మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గట్టి పోటీ
Vivo V30e launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో భారత్ లో మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. రూ. 30 వేల లోపు ధరలో లాంచ్ అయిన ఈ వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Vivo V30e launch: వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్ విడుదలతో భారత్ లో ఇప్పటికే గట్టి పోటీ ఉన్న రూ.30,000 లోపు ధరల సెగ్మెంట్ లో మరింత కాంపిటీషన్ నెలకొన్నది. ఈ సెగ్మెంట్ లో రియల్ మీ 12 ప్రో, నథింగ్ ఫోన్ 2ఏ, వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 వంటివి ఇప్పటికే పాపులర్. వాటికి గట్టి పోటీనిచ్చే ఈ కెమెరా ఫోకస్డ్ వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రూ.27,999 ధరకు లభిస్తోంది.
వివో వీ30 ఈ స్పెసిఫికేషన్లు
వివో వీ30ఈ (Vivo V30e) స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 ×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే, వివో వి 30ఈ స్మార్ట్ ఫోన్ 4 ఎన్ఎమ్ టీఎస్ఎంసీ ప్రాసెస్ ఆధారంగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం అడ్రినో 710 జీపీయూ కూడా ఉంది. ఇందులో 8 జీబీ ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. అంతేకాకుండా మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ను పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఫన్ టచ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఈ డివైజ్ (Vivo V30e) తో 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్ డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లు కూడా లభిస్తాయి.
సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ కలర్స్
వివో వీ 30ఈ (Vivo V30e) లో 5,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. దీనిని బాక్స్ లోపల బండిల్ చేసిన 44 వాట్ అడాప్టర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.1, వై-ఫై 6, 5జీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ (యూఎస్బీ 2.0) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
50 ఎంపీ సోనీ కెమెరా
వివో వీ 30ఈ (Vivo V30e) స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ (50MP SonyIMX 882) సెన్సార్ సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఓఐఎస్, ఆరా లైట్ సపోర్ట్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా 50 ఎంపీ ఉండడం విశేషం.