Vivo V30 Lite : వివో వీ30 లైట్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!-vivo v30 lite 4g launched globally check specs features price and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V30 Lite : వివో వీ30 లైట్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Vivo V30 Lite : వివో వీ30 లైట్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Apr 06, 2024 01:44 PM IST

Vivo V30 Lite 4G : వివో వీ30 లైట్​ 4జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో వీ30 లైట్ 4జీ ఇదిగో..
వివో వీ30 లైట్ 4జీ ఇదిగో.. (Vivo)

Vivo V30 Lite 4G price : వరుస లాంచ్​లతో వివో సంస్థ మంచి జోరు మీద ఉంది. ఇక తాజాగా.. మరో కొత్త స్మార్ట్​ఫోన్​ని అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ చేసింది. దిని పేరు వివో వీ30 లైట్​. ఇదొక 4జీ గ్యాడ్జెట్​. ఇందులోనే 5జీ మోడల్​ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు.. ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

వివో వీ30 లైట్ 4జీ స్పెసిఫికేషన్లు..

వివో వీ30 లైట్ 4జీ వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ54 రేటింగ్​ను కలిగి ఉంటుంది. దీని మెజర్​మెంట్స్​.. 163.17 x 75.81 x 7.79-7.95 మిమీ. బరువు సుమారు 188 గ్రాములు. ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్​ ముందు భాగంలో ఫుల్​ హెచ్​డీ+ రిజల్యూషన్​తో కూడిన 6.67 ఇంచ్​ ఇ4 అమోలెడ్​ డిస్ల్పే, స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​తో అద్భుతమైన విజువల్స్​ని అందిస్తుంది.

ఇక కెమెరా పరంగా.. ఈ వివో వీ30 లైట్ 4జీలో సెల్ఫీలు- వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. వెనుక భాగంలో.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫన్ టచ్ ఓఎస్ 14 ఓవర్​లేతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ఇందులో.. స్నాప్​డ్రాగన్ 685 చిప్​సెట్​ ఉంటుంది. 8జీబీ ఎల్​పీడీడీఆర్ 4ఎక్స్​ ర్యామ్- 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్​తో వస్తుంది.

Vivo V30 Lite price in India : 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ వివో వీ30 లైట్​ సొంతం. ఇది వేగవంతమైన 80వాట్ ఛార్జింగ్​కు మద్దతు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయగలడం విశేషం! ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్​బీ-సీ పోర్ట్, మైక్రోఎస్​డీ కార్డ్ స్లాట్, ఫ్లిక్కర్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వివో వీ30 లైట్ 4జీ: ధర, లభ్యత..

కంబోడియాలో క్రిస్టల్ బ్లాక్, క్రిస్టల్ గ్రీన్ రంగుల్లో లభిస్తున్న వివో వీ30 లైట్ 4జీ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర 299 డాలర్లు. ఇక రష్యాలో దీని ధర 24,999 ఎర్​యూబీ (సుమారు 270 డాలర్లు).

వివో వీ30 లైట్ 5జీతో తేడాలు

Vivo V30 Lite 4G launch : వివో వీ30 లైట్​ 5జీ ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉంది. రెండు మోడళ్లు ఒకే విధమైన ఫీచర్లను అందిస్తున్నప్పటికీ, ముఖ్యంగా ప్రాసెసర్లు- కెమెరాల పరంగా తేడాలు ఉన్నాయి. వివో వీ30 లైట్ 4జీలో స్నాప్​డ్రాగన్​ 685 చిప్- డ్యూయల్ రియర్ కెమెరా సెటప్​తో వస్తుంది, అయితే.. 5జీ వేరియంట్ ప్రాంతాన్ని బట్టి ప్రాసెసర్లలో మారుతుంది. అధిక రిజల్యూషన్ సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. అదనంగా, బ్యాటరీ పరిమాణాలు, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు కొన్ని మార్కెట్లలో భిన్నంగా ఉండవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం