తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphones Launch: 2024 మే నెలలో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Smartphones launch: 2024 మే నెలలో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

02 May 2024, 19:04 IST

  • Smartphones launch: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ మే నెలలో రియల్ మి జీటీ నియో 6, వివో ఎక్స్ 100 సిరీస్, ఒప్పో రెనో 12 సహా ఆరు ఫ్లాగ్ షిప్ మోడల్స్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

ఈ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్స్
ఈ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్స్ (Pexels)

ఈ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్స్

Smartphones launch: మే నెలలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్ జాబితాను డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. మొత్తం ఆరు ఫ్లాగ్ షిప్ గ్రేడ్ ఫోన్లు ఈ మే నెలలో లాంచ్ అవుతాయని తెలిపింది. వాటిలో రియల్ మి జీటీ నియో 6, వివో ఎక్స్ 100 సిరీస్, ఒప్పో రెనో 12 లైనప్ మొదలైనవి ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

రియల్ మీ జీటీ నియో 6

స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, ర్యాపిడ్ 120 వాట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే రియల్ మీ జీటీ నియో 6 స్మార్ట్ ఫోన్ ఈ మే లోనే లాంచ్ కానుంది. ఎస్డీ8ఎస్జీ3 చిప్ తో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఫోన్ గా ఇది నిలవనుంది.

వివో ఎక్స్100ఎస్ సిరీస్

మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్ తో, 1.5 కే రిజల్యూషన్ తో ఫ్లాట్ డిస్ ప్లే, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100 ఎస్ ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ మే నెలలో లాంచ్ కానున్నాయి. ఈ రెండు కాకుండా, అదనంగా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్తో మరో స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం. దీనిని వివో ఎక్స్ 100 అల్ట్రా అని పిలుస్తారు.

ఒప్పో రెనో 12 సిరీస్

ఈ మే నెలలో ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ కానున్నాయి. వీటిలో మైక్రో కర్వ్డ్ డిజైన్ తో ఓఎల్ఈడీ ప్యానెల్ ను ఉంటుందని తెలుస్తోంది. 1.5కే రిజల్యూషన్ ను అందిస్తుందని, డైమెన్సిటీ 9200 చిప్ తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ సిరీస్ లో రెనో 12, రెనో 12 ప్రొ ఉంటాయని తెలుస్తోంది. వీటిలో డైమెన్సిటీ 8200 చిప్ సెట్ ఉంటుంది. వీటితో పాటు స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ సెట్స్ ఉన్న హానర్ 200, స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ ఉన్న 200 ప్రో కూడా ఈ నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మోటో ఎక్స్ 50 అల్ట్రా కూడా ఈ నెలలో లాంచ్ కానుంది.

తదుపరి వ్యాసం