తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Fab Grab Fest : ఈ సామ్​సంగ్​ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే డిస్కౌంట్లు..!

Samsung Fab Grab Fest : ఈ సామ్​సంగ్​ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే డిస్కౌంట్లు..!

Sharath Chitturi HT Telugu

04 May 2024, 8:10 IST

  • Samsung Fab Grab Fest 2024 : సామ్​సంగ్​ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్​పై ప్రకటన వచ్చేసింది! అంతేకాదు… గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ వంటి టాప్ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తోంది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

సామ్​సంగ్​ ఫ్యాబ్​ గ్రాబ్​ ఫెస్ట్​లో స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు..
సామ్​సంగ్​ ఫ్యాబ్​ గ్రాబ్​ ఫెస్ట్​లో స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు.. (HT Tech)

సామ్​సంగ్​ ఫ్యాబ్​ గ్రాబ్​ ఫెస్ట్​లో స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు..

Samsung Fab Grab Fest 2024 date : ఫ్యాబ్​ గ్రాబ్​ ఫెస్ట్​తో.. సమ్మర్​ సేల్​ని ప్రకటించింది దిగ్గజ టెక్​ సంస్థ సామ్​సంగ్​. ఇది కొనుగోలుదారులకు అనేక ఎలక్ట్రానిక్స్ ప్రాడక్ట్స్​పై భారీ డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్స్​ని ఇస్తోంది. స్మార్ట్​ఫోన్​, ఏసీలు, గెలాక్సీ ట్యాబ్లెట్లు తదితర సామ్​సంగ్​ ఉత్పత్తులు భారీ డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. మీరు ఈ వేసవిలో కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటే.. సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్ సిరీస్, గెలాక్సీ జెడ్ సిరీస్, గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్​ఫోన్​పై భారీ డీల్ పొందవచ్చు. ఆ డీల్స్, ఆఫర్స్​ పై ఓ లుక్కేయండి..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

సామ్​సంగ్​ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 24+, గెలాక్సీ ఎస్ 24, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ, గెలాక్సీ ఎస్ 21 ఎఫ్​ఈ, గెలాక్సీ ఏ 55, గెలాక్సీ ఏ 35, గెలాక్సీ ఏ 15 వంటి ఎంపిక చేసిన స్మార్ట్​ఫోన్స్​పై 64 శాతం వరకు తగ్గింపును లభిస్తోంది. Samsung.com, సామ్​సంగ్​ షాప్ యాప్, సామ్​సంగ్​ స్టోర్స్​లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, భారీ డిస్కౌంట్లతో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర ప్రముఖ డెబిట్- క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా కొనుగోలుదారులు.. రూ .25000 వరకు అద్భుతమైన క్యాష్​బ్యాక్​ ఆఫర్లను కూడా పొందవచ్చు.

Samsung Fab Grab Fest sale : సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా: ఈ సామ్​సంగ్​ కొత్త ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ.134999. అయితే సామ్​సంగ్​ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సందర్భంగా కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్​లతో కలిపి రూ.117,999కే ఈ గ్యాడ్జెట్​ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్.. టాప్ కెమెరా స్పెసిఫికేషన్లు, గెలాక్సీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ: మీరు మిడ్ రేంజ్ నుంచి ప్రీమియం స్మార్ట్​ఫోన్​ కోసం వెతుకుతున్నట్లయితే గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ గొప్ప ఎంపిక కావచ్చు. అదనంగా, సామ్​సంగ్​ వెబ్​సైట్​లో మీరు స్మార్ట్​ఫోన్​పై భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు. క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లను పొందడం ద్వారా రూ.44,999కే ఈ స్మార్ట్ ఫోన్​ను పొందవచ్చు.

Offers on Samsung smartphones : సామ్​సంగ్​ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5:​ సామ్​సంగ్​ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్​లో భాగంగా గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5 స్మార్ట్​ఫోన్ కూడా భారీ డిస్కౌంట్​తో లభిస్తోంది. వాస్తవానికి ఈ స్మార్ట్​ఫోన్ 256 జీబీ వేరియంట్ ధర రూ.102,999. అయితే కేవలం రూ.99999కే దీని కొనుక్కోవచ్చు. కొనుగోలుదారులు ఎక్స్చేంజ్ ఆఫర్​ను కూడా పొందవచ్చు. కొనుగోలుపై రూ.45,000 వరకు ఆఫర్​ పొందవచ్చు.

సామ్​సంగ్​ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5: కొత్త ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​.. సామ్​సంగ్​ వెబ్​సైట్​లో చాలా సరసమైన ధరకు లభిస్తోంది. మీరు సామ్​సంగ్​ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 256 జీబీ వేరియంట్ రూ .154999 కు పొందవచ్చు. ది అసలు ధరకు రూ .5000 తక్కువ. మీరు ఖర్చును మరింత తగ్గించాలనుకుంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా పొందవచ్చు. స్మార్ట్​ఫోన్​ మోడల్, పని పరిస్థితులను బట్టి రూ .75000 వరకు తగ్గింపు పొందవచ్చు.

తదుపరి వ్యాసం