OnePlus Open vs Galaxy Z Fold5 : ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది కొనాలి?
OnePlus Open vs Galaxy Z Fold5 : వన్‌ప్లస్ ఓపెన్ వర్సెస్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5.. ఈ రెండు ఫోల్డెబుల్ ఫోన్స్‌లో ఏది బెస్ట్?
OnePlus Open vs Samsung Galaxy Z Fold5 : చైనా దిగ్గజ టెక్ సంస్థ వన్‌ప్లస్.. తొలి ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే ప్రపంచానికి పరిచయం చేసింది. దీని పేరు వన్‌ప్లస్ ఓపెన్. ఇక ఈ గ్యాడ్జెట్.. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్5కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము.
ఈ రెండు ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్ ఇవే..
వన్‌ప్లస్ ఓపెన్‌లో 7.82 ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్ ఉంటుంది. మరోవైపు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్5లో 7.6 ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ ఓల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.
OnePlus Open price in India : వన్‌ప్లస్ ఫోల్డెబుల్ ఫోన్లో 48ఎంపీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రా-వైడ్, 64ఎంపీ టెలిస్కోపిక్ లెన్స్‌తో కూడిన రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. అదే సమయంలో సామ్సంగ్ గ్యాడ్జెట్లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా-వైడ్, 10ఎంపీ టెలిఫొటో కెమెరా సెటప్ రేర్‌లో ఉంటుంది.
ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఓపెన్ ఫోన్లో 32ఎంపీ (ఔటర్ డిస్ప్లే), 20ఎంపీ (ఇన్నర్ డిస్ప్లే) ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. సామ్‌సంగ్‌కు ఇది 10ఎంపీ, 4ఎంపీలుగా ఉంది.
ఇదీ చూడండి:- ఈ పండుగ సీజన్‌లో మీరు కొత్త గెలాక్సీ S23 FEని తప్పక కొనుగోలు చేయడానికి 5 కారణాలు
Samsung Galaxy Z Fold5 price in India : ఈ రెండు ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్స్‌లో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. కాకపోతే సామ్‌సంగ్‌లో ఉన్నది కస్టమ్ ప్రాసెసర్. ఇక వన్‌ప్లస్ డివైజ్‌లో 16జీబీ ర్యామ్ వస్తుండగా (512జీబీ స్టోరేజ్).. సామ్సంగ్ గ్యాడ్జెట్ (12జీబీ ర్యామ్)లో స్టోరేజ్ ఆప్షన్స్ (256జీబీ, 512జీబీ, 1టీబీ) ఎక్కువగా ఉన్నాయి.
OnePlus Open review : వన్‌ప్లస్ ఓపెన్‌లో 4,805ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 67వాట్ వయర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సామ్సంగ్ జెడ్ ఫోల్డ్5లో 4,400ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 25వాట్ వయర్డ్ ఛార్జింగ్ లభిస్తుంది. సామ్‌సంగ్‌కు వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ధరల వివరాలు..
ఇండియాలో వన్‌ప్లస్ ఓపెన్ ధర రూ. 1.4లక్షలుగా ఉంది. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 ధరలు వరుసగా రూ. 1.55లక్షలు, రూ. 1.65లక్షలు, రూ. 1.85లక్షలుగా ఉన్నాయి.
Samsung Galaxy Z Fold5 specs : సామ్సంగ్ డివైజ్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. ఇక ఈ నెల 19న లాంచ్ అయిన వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఈ అక్టోబర్ 27న మొదలవ్వనున్నాయి.
సంబంధిత కథనం