తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy F15: 8 జీబీ ర్యామ్ తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Samsung Galaxy F15: 8 జీబీ ర్యామ్ తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

HT Telugu Desk HT Telugu

19 April 2024, 19:38 IST

google News
  • Samsung Galaxy F15 launch: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో కొత్త గెలాక్సీ ఎఫ్ 15 వేరియంట్ ను శాంసంగ్ భారత్ లో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ధరను రూ. 15,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలను ఇక్కడ చూడండి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్ (Samsung)

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్

Samsung Galaxy F15 launch: శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్ లైనప్ ను భారతదేశంలో మరింత విస్తరించింది. లేటెస్ట్ గా 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కొత్త వేరియంట్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న గెలాక్సీ ఎఫ్ 15 (Samsung Galaxy F15) 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వెర్షన్లకు ఇది జత కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15, ఎఫ్ హెచ్ డీ + డిస్ ప్లే తో. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, ఇందులో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 8జీబీ + 128జీబీ

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 (Samsung Galaxy F15)లో కొత్తగా లాంచ్ అయిన 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. యూజర్లు యాష్ బ్లాక్, గ్రూవీ వయొలెట్, జాజీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. ఈ మోడల్ లో 4 జీబీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 స్పెసిఫికేషన్లు

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డి + డిస్ ప్లేను కలిగి ఉంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్ ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ వన్ యూఐ 6 ఓవర్ లేతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 నాలుగేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్ ను, ఐదేళ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తుంది.

50 ఎంపీ కెమెరా

ఫోటోగ్రఫీ పరంగా, ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వాటిలో ఎఫ్ / 1.8 ఎపర్చర్ తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్ తో 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్ తో 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.

తదుపరి వ్యాసం