Samsung Galaxy F15 5G : సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ.. త్వరలోనే లాంచ్​..!-tech news samsung galaxy f15 5g likely to launch soon in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy F15 5g : సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ.. త్వరలోనే లాంచ్​..!

Samsung Galaxy F15 5G : సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ.. త్వరలోనే లాంచ్​..!

Sharath Chitturi HT Telugu
Feb 18, 2024 07:41 PM IST

Samsung Galaxy F15 price in India : సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 స్మార్ట్​ఫోన్​.. త్వరలోనే ఇండియాలో లాంచ్​ అవుతోంది. ఆ వివరాలు..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ.. త్వరలోనే లాంచ్​..!
సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ.. త్వరలోనే లాంచ్​..! (Representative Image)

Samsung Galaxy F15 India launch : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో సరికొత్త గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది సామ్​సంగ్​ సంస్థ. దాని పేరు సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఫ్లిప్​కార్ట్​లో ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన టీజర్​ లైవ్​ అయ్యింది. త్వరలోనే ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని ఆ టీజర్​లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15- ఫీచర్స్​ ఇవేనా..?

లీక్స్​ ప్రకారం.. సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీలో మీడియాటెక్​ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్​ ఉంటుంది. 4జీబీ ర్యామ్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత సామ్​సంగ్​ వన్​ యూఐ సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

Samsung Galaxy F15 5G price in India : ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15లో.. గెలాక్సీ ఏ15 5జీ ఫీచర్స్​ రిపీట్​ అవ్వొచ్చు. ఆ గ్యాడ్జెట్​లో.. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 13 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా, 50ఎంపీతో కూడిన ట్రిపుర్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటాయి. టీజర్​ ప్రకారం.. గెలాక్సీ ఎఫ్​15లో కూడా ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉంటుందని స్పష్టమైంది.

ఇక ప్రముఖ టిప్​స్టర్​ ముకుల్​ శర్మ ప్రకారం.. సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ స్మార్ట్​ఫోన్​లో.. 3 కలర్​ ఆప్షన్స్​ ఉంటాయి. అవి.. బ్లాక్​, పింక్​, గ్రేడియంట్​ ఫినిష్​.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 ధర ఎంత ఉండొచ్చు?

Samsung Galaxy F15 price : లీక్​ అయిన డేటాను చూస్తే.. సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ.. ఒక పక్కా బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అని స్పష్టమవుతోంది. బయటకు వచ్చిన ఫీచర్సే నిజమైతే.. ఈ మోడల్​ ధర రూ. 15వేల కన్నా తక్కువగానే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​ మరింత పోటీ ఖాయమని అభిప్రాయపడుతున్నాయి.

అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లో ఉన్నాయి. బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 ఫీచర్స్​, ధరపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లాంచ్​ డేట్​పైనా క్లారిటీ రావాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం