తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 9, 2024: Ap Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Andhra Pradesh News Live September 9, 2024: AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

09 September 2024, 21:45 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

09 September 2024, 21:45 IST

Andhra Pradesh News Live: AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

  • AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించగా... ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో స్కూళ్లకు హాలీడే ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 21:33 IST

Andhra Pradesh News Live: Kadapa Anganwadi Jobs : క‌డ‌ప జిల్లాలో 74 అంగ‌న్వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల

  • Kadapa Anganwadi Jobs : కడప జిల్లాలో 74 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 17 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అంగ‌న్‌వాడీ కార్యక‌ర్త, హెల్పర్, మినీ అంగ‌న్‌వాడీ కార్యక‌ర్త పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 18:56 IST

Andhra Pradesh News Live: Prakasam Barrage Boats Case : ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్- టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు

  • Prakasam Barrage Boats Case : ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల వరదల సమయంలో నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 18:19 IST

Andhra Pradesh News Live: Ganesh Immersion : వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు గల్లంతు!

  • Ganesh Immersion : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విషాదం జరిగింది. ఆనందంగా గణపతి నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 17:37 IST

Andhra Pradesh News Live: Devineni Avinash : ఆఫీస్‌పై దాడి కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు దేవినేని అవినాష్‌

  • Devineni Avinash : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 16:57 IST

Andhra Pradesh News Live: Deep Depression Landfall : పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

  • Deep Depression Landfall : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం పూరీ వద్ద తీరం దాటింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు ఒడిశా, కోస్తాంధ్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 16:33 IST

Andhra Pradesh News Live: LG Free Service to Flood Victims : వరద బాధితులకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సాయం, ఉచిత సర్వీస్ చేస్తామని ప్రకటన

  • LG Free Service to Flood Victims : వరద బాధితులకు సాయం అందించేందుకు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఖమ్మం జిల్లాలో నీట మునిగి పాడైన ఎల్జీ వస్తువులకు ఉచితంగా సర్వీస్ చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. స్పేర్ పార్ట్ లపై 50 శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 15:15 IST

Andhra Pradesh News Live: Yeleru Bund Breach : ఏలేరు కాలువ‌కు గండి, భారీగా పంటనష్టం- పిఠాపురం నియోజకవర్గానికి వరద ముంపు

  • Yeleru Bund Breach : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గండి పూడ్చివేత పనులు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 14:31 IST

Andhra Pradesh News Live: Ysrcp Mla : వాగులో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యే సాహసం, వీడియో వైరల్

  • Ysrcp Mla : వాగులో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సాహసం చేశారు. అల్లూరి జిల్లాలోని రాయిగడ వాగును బైక్ పై దాటేందుకు ప్రయత్నించిన యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సాహసోపేతంగా యువకుడి వద్దకు వెళ్లి అతడ్ని రక్షించారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 14:01 IST

Andhra Pradesh News Live: Barrage Accident: ప్రకాశం బ్యారేజీ ప్రమాదంపై దర్యాప్తు, ఘటనలో కుట్రకోణంపై అనుమానాలు…

  • Barrage Accident: ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని.. అన్నంపెట్టే అన్నదాతలకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 13:27 IST

Andhra Pradesh News Live: Flood loss in Vja: నేటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో నష్ట గణన, బాధితులకు పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం

  • Flood loss in Vja: బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి వరద నష్టాన్ని రెవిన్యూ అధికారులు  లెక్కించనున్నారు. విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో  వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం  క్షేత్ర స్థాయిలో గణన చేపట్టనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 13:11 IST

Andhra Pradesh News Live: Araku Valley : దయచేసి వినండి.. మరికొన్ని రోజులు అరకు రావొద్దు.. అధికారుల కీలక నిర్ణయం

  • Araku Valley : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా కోస్తాంధ్రపై ప్రతాపం చూపిన వర్షాలు.. ఇప్పుడు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులు అరకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 10:20 IST

Andhra Pradesh News Live: Bus Accident : అల్లూరి జిల్లాలో ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు.. 16 మందికి గాయాలు

  • Bus Accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బ‌స్సు వాగులోకి దూసుకెళ్లింది. వాగు - రోడ్డు మ‌ధ్య బ‌స్సు వేలాడుతుంది. ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ స‌హా 16 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు ప్ర‌యాణికుల‌ను కాపాడారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 9:48 IST

Andhra Pradesh News Live: Godavari Flood Alert : గోదావరికి భారీగా వరద వచ్చే ఛాన్స్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు అలెర్ట్!

  • Godavari Flood Alert : అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. మరో రెండు రోజుల్లో అతి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 9:17 IST

Andhra Pradesh News Live: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు స్పాట్‌డెడ్‌

  • క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో త‌ల్లి, కొడుకు, కోడ‌లు ఉన్నారు. మ‌రో ఆరుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను వైద్యం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 7:02 IST

Andhra Pradesh News Live: Budameru High Alert: బుడమేరుకు మళ్లీ వరద.. ఆ ప్రాంతాలకు మళ్లీ ముంపు ముప్పు, 7 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చే ఛాన్స్

  • Budameru High Alert: విజయవాడ నగరానికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరు పరివాహక ప్రాంతంలో  నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. బుడమేరు గండ్లు పూడ్చినా సోమవారం తెల్లవారు జాము నుంచి వరద ప్రవాహం పెరగడంతో హై అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 5:00 IST

Andhra Pradesh News Live: Budameru Flash Flood Report: నాలుగు నెలల వర్షం 48గంటల్లో...బెజవాడను ముంచెత్తిన బుడమేరు వరద.. ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

  • Budameru Flash Flood Report: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడానికి కారణం ఏమిటో వెలుగు చూసింది...అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా హిందుస్తాన్‌ టైమ్స్‌ తెలుగుకు ఎక్స్‌క్లూజివ్‌గా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద విపత్తు సమాచారం అందింది. అంచనాలకు అందని కుంభవృష్టి నగరాన్ని ముంచెత్తడమే వరదలకు అసలు కారణం..
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి