AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించగా... ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో స్కూళ్లకు హాలీడే ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
AP Schools Holiday : వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటినా...దాని ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు(మంగళవారం) అల్లూరి జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండపల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిగత స్కూళ్లు యథాతథంగా పనిచేస్తాయని తెలిపారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాబోవు రెండు రోజులకు వాతావరణ సూచనలు
ఉత్తర కోస్తాంధ్ర, యానాం
రేపు(మంగళవారం)
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి(బుధవారం)
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ
రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల . వేగముతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్
వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రేపు(మంగళవారం) ఉదయం 11.30 గంటల వరకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సంబంధిత కథనం