Ganesh Immersion : వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు గల్లంతు!-three young men lost in the immersion of vinayaka idols in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ganesh Immersion : వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు గల్లంతు!

Ganesh Immersion : వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు గల్లంతు!

Ganesh Immersion : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విషాదం జరిగింది. ఆనందంగా గణపతి నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి (HT)

తిరుపతి జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనంలో విషాదం జరిగింది. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తూ.. ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నాయడుపేట కావమ్మ గుడిసెంటర్‌కు చెందిన మునిరాజా, ఫయాజ్‌గా గుర్తించారు. మరో యువకుడి వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. గల్లంతైనవారి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. పండగపూట ఆ ముగ్గురు యువకుల కుటుంబంలో విషాదం నెలకొంది.

జాగ్రత్తలు పాటించండి..

వినాయక నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలో నిమజ్జనానికి వెళ్లేవారు లోపలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పోలీసుల సూచనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. చెరువులు, కుంటలు, కాలువల్లో అధికారులు సూచించిన చోట మాత్రమే నిమజ్జనం చేయాలని స్పష్టం చేస్తున్నారు.

విశాఖలో పవన్ గణపతి..

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరుపుకుంటున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో.. పవన్ కళ్యాణ్ గణపతి దర్శనమిచ్చారు. అక్కడ పవన్‌ను పోలిన వినాయకుడిని ప్రతిష్టించారు. గతంలో జాలర్ల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఒక చేతిలో వల.. మరో చేతిలో జాలరి గంప పట్టుకొని కనిపించారు. ఇప్పుడు అచ్చం విగ్రహం తయారుచేసి ప్రతిష్టించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.