Flood loss in Vja: నేటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో నష్ట గణన, బాధితులకు పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం
Flood loss in Vja: బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి వరద నష్టాన్ని రెవిన్యూ అధికారులు లెక్కించనున్నారు. విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో గణన చేపట్టనున్నారు.
Flood loss in Vja: లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయుల్ని చేసిన బుడమేరు ముంపు నుంచి విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే తెరుకుంటోంది. వరద ముంపు నుంచి కట్టుబట్టలతో బయటపడిన ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు విజయవాడలో వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించింది.
గత 9 రోజులుగా విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని ఉపద్రవం ముంచుకొచ్చిందని మంత్రి సారథి పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత రికార్డు స్థాయిలో వరదలు రావడం జరిగిందని, ఇలాంటి విపత్కర పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటోందని మంత్రి పార్థసారథి తెలిపారు. .
వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశముండటంతో ప్రభుత్వం ముందే అప్రమత్తమై 4,5 వేల మంది సిబ్బందితో శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతుందన్నారు. దాదాపు 100-120 ఫైర్ ఇంజిన్లు, పంపులతో ఎప్పటికప్పుడు రోడ్లు, బాధితుల గృహాల్లో బురద తొలగించి శుభ్రం చేస్తున్నామన్నారు.
1700 బృందాలతో నష్టం లెక్కింపు…
వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1700 ఎన్యూమరేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, వార్డు అసిస్టెంట్, పోలీసుతో కూడిన బృందం ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రతి సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా స్థాయి అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధి పర్యవేక్షిస్తారన్నారు. ప్రాథమికంగా 2,50,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, నష్టం వాటిల్లిందని అంచనా వేశామన్నారు. నష్టం అంచనా నమోదుకు అధికారులు ప్రత్యేక యాప్ రూపొందించారని తెలిపారు.
ఎన్యుమరేషన్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకుంటే తర్వాత అయినా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్యూమరేషన్ తమ గృహం, పేరు రాకపోతే స్థానిక ప్రజాప్రతినిధిని కలవాలని సూచించారు. వివరాలు సేకరించి యాప్ లో నష్టపోయిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
నిబద్ధతతో వాస్తవ గణాంకాలు నమోదుచేయాలి..సిసోడియా
భారీ వర్షాలు, వరద ముంపుతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ న్యాయం జరగాల్సిన అవసరముందని.. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ఆర్‌పీ సిసోడియా అన్నారు.
వరద ముంపు నష్టాలను నమోదు చేసేందుకు ఏర్పాటుచేసిన బృంద సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ నగరం, గ్రామీణ ప్రాంతాల్లో 170 సచివాలయాల పరిధిలో రెండు లక్షల 30 వేలకు పైగా నివాసాల్లో నష్టాన్ని గణించనున్నట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలంలోని ఐదు గ్రామాలు సైతం నష్ట పోయాయన్నారు. అపారమైన వరద నష్టం అంచనాలో 149 మంది తహశీల్దార్లతో సహా పలువురి సేవలు వినియోగించుకుంటున్నామని, వీరందరినీ వివిధ జిల్లాల నుండి తీసుకోవడం జరిగిందన్నారు.
నష్ట గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక ఐఎఎస్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయం పరిధిలో 10 గణన బృందాలు ఉంటాయని.. ఈ బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని ఇళ్లు, వాణిజ్య వ్యాపార సంస్థల నుంచి తీసుకుంటారని సిసోడియా స్పష్టం చేశారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ల నష్టం గణన కోసం 200 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
నష్టపోయిన వారందరికీ పూర్తిస్దాయిలో న్యాయం జరిగేలా గణన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశించారని, ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమానికి బాధితులు పూర్తిసహకారం అందించాలని కోరారు. మొత్తం సమాచారాన్ని బాధితుల సమక్షంలోనే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో నిక్ష్తిప్తం చేస్తారని సిసోడియా పేర్కొన్నారు.
బాధితులు ఎంతో ఆవేదనతో ఉంటారని.. వారి బాధను అర్థంచేసుకొని మనస్ఫూర్తిగా సహాయసహకారాలు అందించి, కష్టం నుంచి గట్టెక్కెలా చేయడంలో ఎన్యూమరేషన్ బృంద సభ్యులు కీలకంగా వ్యవహరించాలని సిసోడియా సూచించారు. అదనపు సిసిఎల్ ఎ.ప్రభాకర్ రెడ్డి మూడు రోజుల కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారన్నా