ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరికొద్ది రోజుల్లో ఏడాది కావొస్తుంది. ఏడాది పాలనలో ప్రభుత్వ పనితీరుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి.పాలనా వ్యవహారాలకు కేంద్ర స్థానమైన సీఎంఓలో కూడా త్వరలో బదిలీలు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.