తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 23, 2024: Kethireddy Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లిన కేతిరెడ్డి కారు
Kethireddy Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లిన కేతిరెడ్డి కారు
Kethireddy Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లిన కేతిరెడ్డి కారు

Andhra Pradesh News Live September 23, 2024: Kethireddy Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లిన కేతిరెడ్డి కారు

23 September 2024, 22:21 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

23 September 2024, 22:21 IST

Andhra Pradesh News Live: Kethireddy Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లిన కేతిరెడ్డి కారు

  • Kethireddy Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి సబ్ జైల్ లో కార్యకర్తలను పరామర్శించేందుకు రాగా...కూటమి పార్టీల కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కేతిరెడ్డి కారు బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లింది.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 21:21 IST

Andhra Pradesh News Live: AP TET Hall ticket Corrections : ఏపీ టెట్ హాల్ టికెట్లలో తప్పులన్నాయా? కరెక్షన్ కు విద్యాశాఖ అవకాశం- ఏంచేయాలంటే?

  • AP TET Hall ticket Corrections : ఏపీలో టెట్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే హాల్ టికెట్లలో పొరపాట్లు దొర్లయాని అభ్యర్థులు గుర్తించారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పుల సవరణకు అధికారులు అవకాశం కల్పించారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 19:31 IST

Andhra Pradesh News Live: AP Rains Alert : రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీకి రెయిన్ అలర్ట్

  • AP Rains Alert : రెండు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో రాబోవు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 18:43 IST

Andhra Pradesh News Live: CM Chandrababu : జూనియర్ న్యాయవాదులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, నెలరు రూ.10 వేలు ఆర్థిక సాయం

  • CM Chandrababu : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 17:36 IST

Andhra Pradesh News Live: Volunteers Protest : ఏపీలో వాలంటీర్లు పోరు బాట, విధుల్లోకి తీసుకోవాలని ఆందోళ‌న

  • Volunteers Protest : ఏపీలో వాలంటీర్లు రోడెక్కారు. తమ విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంంలోని పలు జిల్లాల్లో వాలంటీర్లు ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతి పత్రాలు అందించారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 16:40 IST

Andhra Pradesh News Live: Ponnavolu on Tirumala Laddu : రూ.320 నెయ్యిలో రూ.1400 ఖరీదైన పంది కొవ్వు ఎలా కలుపుతారు?- పొన్నవోలు

  • Ponnavolu on Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వైసీపీ నేత, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పంది కొవ్వు కేజీ రూ.450 నుంచి రూ.1400 వరకు ఉంటుందని, రూ.320 నెయ్యిలో ఖరీదైన పంది కొవ్వు కలుపుతారా? అని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 16:00 IST

Andhra Pradesh News Live: Mumbai Actress Case : ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

  • Mumbai Actress Case : ముంబయి నటి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో ముగ్గురు ఐపీఎస్ లతో పాటు మరో ఇద్దరు పోలీసులను నిందితులుగా చేర్చారు. నటి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేశారని వీరిపై అభియోగాలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 15:26 IST

Andhra Pradesh News Live: Kadapa Robberies : కడప జిల్లాలో వరుస చోరీలు, సీసీకెమెరాలకు బ్లాక్ స్ప్రే-ఆ ఇళ్లు, ఏటీఎంలే టార్గెట్!

  • Kadapa Robberies : కడప జిల్లాలో వరుస చోరీలతో దొంగలు హడలెత్తిస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే చోరీకి పాల్పడి సవాల్ విసురుతున్నారు. ఏటీఎంలు, తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 14:35 IST

Andhra Pradesh News Live: AP New Pensions : కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు- అక్టోబర్ నుంచి అర్హులు, అనర్హులు గుర్తింపు!

  • AP New Pensions : ఏపీ సర్కార్ కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన పెన్షన్లపై గ్రామ సభల ద్వారా అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు.కొత్త పింఛన్లపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనుంది.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 13:35 IST

Andhra Pradesh News Live: Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి

  • Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని పిటిషన్‌ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 12:20 IST

Andhra Pradesh News Live: YSRCP to TDP, Janasena: అక్కడ చెల్లని కాసులు ఇక్కడ చెల్లుతాయా? వారి మీద జనంలో వ్యతిరేకత మాటేమిటి?

  • YSRCP to TDP, Janasena: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు పాత పరిచయాలతో తమ దారి తాము చూసుకుంటుంటే కార్పొరేషన్లలో నాయకులు అధికారంలో ఉన్నన్నాళ్లు పనులు చక్క బెట్టుకోడానికి గోడ దూకేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 11:45 IST

Andhra Pradesh News Live: AP Nominated Posts : గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ

  • AP Nominated Posts : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలే బలం అని.. వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 10:44 IST

Andhra Pradesh News Live: AP TET 2024 Schedule: ఏపీ టెట్ 2024 టైమ్‌ టేబుల్‌ విడుదల…. హాల్‌ టిక్కెట్లలో జారీలో గందరగోళం..ఒకే రోజు రెండు పరీక్షలు?

  • AP TET 2024 Schedule: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదలైంది. మరోవైపు టెట్‌ పరీక్షల హాల్ టిక్కెట్లను  ఆదివారం నుంచి విద్య శాఖ విడుదల చేస్తోంది. హాల్‌ టిక్కెట్ల జారీలో విద్యాశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అభ్యర్థులకు ఒకే రోజు వేర్వేరు కేంద్రాల్లో  హాల్‌ టిక్కెట్లను జారీ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 9:26 IST

Andhra Pradesh News Live: Vijayawada : నీళ్ల‌నుకుని యాసిడ్ తాగిన ఏడాదన్న చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి

  • Vijayawada : విజ‌య‌వాడ‌లో విషాదం జరిగింది. నీళ్ల‌నుకుని యాసిడ్ తాగిన ఏడాదన్న చిన్నారి మృతి చెందింది. దీంతో త‌ల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీసులు కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 8:26 IST

Andhra Pradesh News Live: TTD Online Quota: నేడు డిసెంబర్‌ నెల తిరుమల శ్రీవారి ఆన్‌లైన్‌ కోటా టిక్కెట్ల విడుదల

  • TTD Online Quota: తిరుమల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్‌ కోటా టిక్కెట్లను నేడు విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ నెలలో దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. శ్రీవాణి టిక్కెట్లు, వృద్దులు, వికలాంగుల కోటా, గదుల కోటా టిక్కెట్లను  ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 7:07 IST

Andhra Pradesh News Live: Maredumilli Accident: జలపాతంలో కొట్టుకుపోయిన వైద్య విద్యార్థులు, ఒక్కసారిగా పెరిగిన ఉధృతిలో ముగ్గురి గల్లంతు

  • Maredumilli Accident: విహార యాత్రకు వచ్చిన వైద్య విద్యార్థులు జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతిలో కొట్టుకుపోయిన ఘటన మారేడుమిల్లిలో జరిగింది.ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ స్టూడెంట్స్‌ కొట్టుకుపోగా ఇద్దరిని ఒడిశాకు చెందిన యువకులు కాపాడారు.ముగ్గురు గల్లంతయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 6:20 IST

Andhra Pradesh News Live: Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...దైవ ద‌ర్శనానికి వెళ్లి వస్తుండ‌గా ప్రమాదంలో ముగ్గురు మృతి

  • Tirupati Accident: తిరుప‌తి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.ఆగి ఉన్న కంటెయిన‌ర్ లారీని వెనక నుంచి కారు అతి వేగంగా ఢీకొట్టింది.పుణ్యక్షేత్రం అరుణాచ‌లం దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండుగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారు. 
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 6:13 IST

Andhra Pradesh News Live: TTD SanthiHomam: నేడు తిరుమలలో శాంతి హోమం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

  • TTD SanthiHomam: కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదం నాణ్యత విషయంలో దిద్దుబాటు చర్యలతో పాటు ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించింది.నాణ్యతా లోపాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన టీటీడీ, నేడు  హోమం నిర్వహించనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

23 September 2024, 5:40 IST

Andhra Pradesh News Live: AP Politics : బాలినేని పరిస్థితి ఏంటీ ఇలా అయ్యింది.. ఆయన్ను మళ్లీ తీసుకోవద్దనే డిమాండ్ ఎందుకొస్తుంది?

  • AP Politics : వైసీపీలో గౌరవం దక్కడం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన తలుపు తట్టారు. పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ తీసుకోవద్దని వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి