AP Rains Alert : రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీకి రెయిన్ అలర్ట్
AP Rains Alert : రెండు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో రాబోవు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Rains Alert : ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి దక్షిణ మయన్మార్ తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటితో పాటు కొనసాగుతున్న రెండు ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తా మయన్మార్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణితో అనుసంధానమయ్యాయని ఐఎండీ తెలిపాుర. రెండు ఆవర్తనాలు, ద్రోణి ఇవాళ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒకే ఉపరితల ఆవర్తనంగా కలిసిపోయి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశగా వంగి ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు పశ్చిమ రాజస్థాన్, కచ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇవాళ్టికి తిరోగమనం చెందాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఈ నెల 17వ తేదీకి వెనక్కి మరలాల్సి ఉందన్నారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో పశ్చిమ రాజస్థాన్ మీదుగా యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణ శాఖ సూచనలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రేపు(మంగళవారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశము చాలా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.
ఎల్లుండి(బుధవారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ
ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
సంబంధిత కథనం