AP TG Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్షసూచన
- AP TG Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవొచ్చని ఐఎండి అంచనా వేస్తోంది.ఏపీలో కోస్తా జిల్లాలాకు వర్ష సూచనలు ఉన్నాయి.తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేవారు. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ సూచించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TG Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవొచ్చని ఐఎండి అంచనా వేస్తోంది.ఏపీలో కోస్తా జిల్లాలాకు వర్ష సూచనలు ఉన్నాయి.తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేవారు. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ సూచించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఐఎండి అంచనాల ప్రకారంపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
(2 / 7)
అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
(3 / 7)
25 సెప్టెంబర్,బుధవారంకాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
(4 / 7)
24 సెప్టెంబర్, మంగళవారం • పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 7)
సెప్టెంబర్ ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కోలుకోలేని దెబ్బతీశాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రోజుల పాటు పలు జిల్లాలు వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది.
(6 / 7)
23 సెప్టెంబర్, సోమవారం• పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం,కాకినాడ, తూర్పుగోదావరి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు