Kadapa Robberies : కడప జిల్లాలో వరుస చోరీలు, సీసీకెమెరాలకు బ్లాక్ స్ప్రే-ఆ ఇళ్లు, ఏటీఎంలే టార్గెట్!
Kadapa Robberies : కడప జిల్లాలో వరుస చోరీలతో దొంగలు హడలెత్తిస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే చోరీకి పాల్పడి సవాల్ విసురుతున్నారు. ఏటీఎంలు, తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.
Kadapa Robberies : కడప జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలోని పలు చోట్ల వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్ట, పులివెందుల, కమలాపురంలో చోరీలకు పాల్పడ్డారు. తాజాగా మైదుకూరులోని ఓ జ్యువెలరీ షాపులో దొంగతనం చేశారు. మైదుకూరులోని మిట్టా జ్యువెలరీ షాపులో కిలో బంగారం, భారీగా వెండి వస్తువులను దోచేశారు. షాపు వెనుక భాగంలో రంధ్రం చేసి లోపలికి చొరబడిన దొంగలు..సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను పగులగొట్టారు. గోల్డ్ షాపు గత రెండు రోజులుగా తెరవకపోవడంతో దొంగల కన్ను ఆ షాపుపై పడింది. షాపు వెనుక నుంచి చొరబడి బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి కడప జిల్లాలో వరుస చోరీలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇండ్లు, ఏటీఎం కేంద్రాలు, హైవేల మీద తిరిగే లారీలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్టలో ఆదివారం తెల్లవారుజామున పులివెందులలో భారీ చోరీలు జరిగాయి. పులివెందులలోని ఓ ఇంటిలో సుమారు రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, రూ.1 లక్ష నగదు చోరీ చేశారు. ఇక ఒంటిమిట్ట ఏటీఎంలో రూ.36 లక్షలు, కడప ద్వారకానగర్ లోని ఏటీఎంలో రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు.
ఏటీఎమ్ లలో వరుస చోరీలు
ఒంటిమిట్ట ఏటీఎమ్ చోరీకి పాల్పడిన వ్యక్తులు ముఖానికి మంకీ క్యాపులు పెట్టుకుని కెమెరాలకు నలుపురంగును స్ర్పే చేశారు. దొంగతనానికి పాల్పడిన ముఠా ముందుగా రెక్కీ చేశారు. ఏటీఎమ్ ముందు కారును ఆపి అందులోని ఒక వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించాడు. మరో వ్యక్తి బయట కాపలాగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో చోరీ అనంతరం రాజంపేట వైపు వేగంగా కారులో పరారైనట్లు సీసీ కెమెరాల్లో రికార్డైందని పోలీసులు తెలిపారు.
ద్వారకానగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తొలగించి అందులోని రూ. 6 లక్షల నగదును చోరీ చేశారు. ఇదే గ్యాంగ్ ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ సమీపంలోని మరో ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్ తో తొలగించి ఉన్న రూ. 36 లక్షల నగదును చోరీచేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నలుపు రంగు పూసి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటన పోలీస్ స్టేషన కు సమీపంలోనే జరగడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. మరో చోట ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించగా అలారమ్ మోగడంతో దొంగలు పరారయ్యారు.
ఒంటిమిట్ట ఏటీఎమ్ చోరీకి పాల్పడిన వ్యక్తులు ముఖానికి మంకీ క్యాపులు పెట్టుకుని కెమెరాలకు నలుపురంగును స్ర్పే చేశారు. దొంగతనానికి పాల్పడిన ముఠా ముందుగా రెక్కీ చేశారు. ఏటీఎమ్ ముందు కారును ఆపి అందులోని ఒక వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించాడు. మరో వ్యక్తి బయట కాపలాగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో చోరీ అనంతరం రాజంపేట వైపు వేగంగా కారులో పరారైనట్లు సీసీ కెమెరాల్లో రికార్డైందని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం