AP TET Hall ticket Corrections : ఏపీ టెట్ హాల్ టికెట్లలో తప్పులున్నాయా? కరెక్షన్ కు పాఠశాల విద్యాశాఖ అవకాశం- ఏంచేయాలంటే?-ap tet hall ticket mistakes education department given chance to correction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Hall Ticket Corrections : ఏపీ టెట్ హాల్ టికెట్లలో తప్పులున్నాయా? కరెక్షన్ కు పాఠశాల విద్యాశాఖ అవకాశం- ఏంచేయాలంటే?

AP TET Hall ticket Corrections : ఏపీ టెట్ హాల్ టికెట్లలో తప్పులున్నాయా? కరెక్షన్ కు పాఠశాల విద్యాశాఖ అవకాశం- ఏంచేయాలంటే?

Bandaru Satyaprasad HT Telugu
Updated Sep 23, 2024 09:37 PM IST

AP TET Hall ticket Corrections : ఏపీలో టెట్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే హాల్ టికెట్లలో పొరపాట్లు దొర్లయాని అభ్యర్థులు గుర్తించారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పుల సవరణకు అధికారులు అవకాశం కల్పించారు.

ఏపీ టెట్ హాల్ టికెట్లలో తప్పులు, కరెక్షన్ కు విద్యాశాఖ అవకాశం- ఏంచేయాలంటే?
ఏపీ టెట్ హాల్ టికెట్లలో తప్పులు, కరెక్షన్ కు విద్యాశాఖ అవకాశం- ఏంచేయాలంటే?

AP TET Hall ticket Corrections : ఏపీలో టెట్ పరీక్షల నిర్వహణ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇప్పటికే అభ్యర్థులకు అందుబాటులో ఉంచాయి. అయితే టెట్ హాల్ టికెట్లలో పలు పొరపాట్లు దొర్లాయి. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో అభ్యర్థులకు పరీక్షలు ఉన్నట్లు హాల్ టికెట్లు తెలుపుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.

టెట్ హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి పరీక్ష కేంద్రం వద్ద నామినల్‌ రోల్స్‌లో సరిచేయించుకోవచ్చని అధికారులు సూచించారు. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. టెట్ పరీక్షలు(జులై 2024) మొత్తంగా 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా ఇప్పటికే 2,84,309 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అధికారులు తెలిపారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

టెట్‌ పరీక్షల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు డైరెక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఉదయం 10 గంటల నుంచి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమాధానం తెలుసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం 9398810958, 6281704160, 8125046997, 8121947387, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618 ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ సందేహాలను grievences.tet@apschooledu.inకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని అధికారులు సూచించారు.

టెట్ పరీక్షల టైమ్ టేబుల్

ఏపీ టెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 3వతేదీ నుంచి ఏపీ టెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం అవుతాయి. రోజూ రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహిస్తారు.

  • అక్టోబర్‌3 -మొదటి సెషన్‌లో పేపర్ 2ఏ లాంగ్వేజ్‌‌లో తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, ఉర్దూ, సంస్కృతం, రెండో సెషన్‌లో పేపర్‌ 2ఏలో తెలుగు పరీక్ష
  • అక్టోబర్ 4 - ఉదయం సెషన్‌లో పేపర్‌ 2ఏ తెలుగు, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌ 2ఏ ఇంగ్లీష్
  • అక్టోబర్ 5 - ఉదయం సెషన్‌లో పేపర్‌ 2ఏ ఇంగ్లీష్, పేపర్‌ 2ఏ హిందీ పరీక్షలు, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌ 2ఏ హిందీ పరీక్ష
  • అక్టోబర్ 6 - ఉదయం సెకండరీ గ్రేడ్ టీచర్‌ 1ఏ , 1బీ పరీక్షలు, మధ్యాహ్నం ఎస్జీటీ 1ఏ పరీక్షను నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 7, 8, 9, 10 - రెండు సెషన్లలో ఎస్జీటీ పేపర్ 1ఏ పరీక్షలు
  • అక్టోబర్ 11, 12 - సెలవులు
  • అక్టోబర్ 13 - ఉదయం సెషన్‌లో ఎస్జీటీ పేపర్‌ 1ఏ, మధ్యాహ్నం ఎస్జీటీ 1ఏ తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, తమిళం, సంస్కృతం పరీక్షలు
  • అక్టోబర్‌ 14 - ఎస్జీటీ 1ఏ తెలుగు, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ మ్యాథ్స్, సైన్స్‌ పరీక్షలు
  • అక్టోబర్ 15- ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పేపర్ 2ఏ మ్యాథ్స్‌, సైన్స్‌
  • అక్టోబర్ 16 - ఉదయం పేపర్‌ 2ఏ మ్యాథమెటిక్స్‌, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, ఇంగ్లీష్‌
  • అక్టోబర్ 17 - రెండు సెషన్లలో పేపర్ 2ఏలో మ్యాథ్స్‌, సైన్స్‌
  • అక్టోబర్ 18 - ఉదయం సెషన్‌లో పేపర్ 2ఏ మ్యాథ్స్‌, మధ్యాహ్నం
  • అక్టోబర్ 19 - ఉదయం, సాయంత్రం పేపర్ 2ఏ సోషల్
  • అక్టోబర్ 20 - ఉదయం పేపర్‌ 2ఏ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళం, ఇంగ్లీష్‌, మధ్యాహ్నం సెషన్‌లో సోషల్
  • అక్టోబర్‌ 21 - ఉదయం సోషల్‌ పరీక్ష మధ్యాహ్నం పేపర్ 2బి పరీక్ష

Whats_app_banner

సంబంధిత కథనం