AP TET 2024 Schedule: ఏపీ టెట్ 2024 టైమ్‌ టేబుల్‌ విడుదల…. హాల్‌ టిక్కెట్లలో జారీలో గందరగోళం..ఒకే రోజు రెండు పరీక్షలు?-ap tet 2024 time table release confusion in issuance of hall tickets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Schedule: ఏపీ టెట్ 2024 టైమ్‌ టేబుల్‌ విడుదల…. హాల్‌ టిక్కెట్లలో జారీలో గందరగోళం..ఒకే రోజు రెండు పరీక్షలు?

AP TET 2024 Schedule: ఏపీ టెట్ 2024 టైమ్‌ టేబుల్‌ విడుదల…. హాల్‌ టిక్కెట్లలో జారీలో గందరగోళం..ఒకే రోజు రెండు పరీక్షలు?

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 23, 2024 10:44 AM IST

AP TET 2024 Schedule: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదలైంది. మరోవైపు టెట్‌ పరీక్షల హాల్ టిక్కెట్లను ఆదివారం నుంచి విద్య శాఖ విడుదల చేస్తోంది. హాల్‌ టిక్కెట్ల జారీలో విద్యాశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అభ్యర్థులకు ఒకే రోజు వేర్వేరు కేంద్రాల్లో హాల్‌ టిక్కెట్లను జారీ చేశారు.

ఏపీ టెట్‌ టైమ్‌ టేబుల్ విడుదల
ఏపీ టెట్‌ టైమ్‌ టేబుల్ విడుదల

AP TET Schedule: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ హాల్‌ టిక్కెట్లు ఆదివారం విడుదలయ్యాయి. మరో వైపు అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలయ్యే టెట్ 2024 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

ఆదివారం విడుదల చేసిన హాల్‌ టిక్కెట్లలో పలువురు అభ్యర్థులకు ఒకే రోజు రెండు పరీక్షల వేర్వేరు కేంద్రాలను కేటాయించారు. దీంతో అభ్యర్థులు ఒక్క పరీక్షకు మాత్రమే హాజరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

అక్టోబరు 3 నుంచి ఏపీలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అనేకమంది దరఖాస్తు చేసుకోగా, ఆదివారం నుంచి ఆన్ లైన్లో హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిం చారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఏపీ టెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్‌ పరీక్షల టైమ్‌ టేబుల్‌ను విడుదల చేశారు.

అక్టోబర్‌ 3వతేదీ నుంచి ఏపీ టెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం అవుతాయి. రోజూ రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహిస్తారు. అక్టోబర్‌3న మొదటి సెషన్‌లో పేపర్ 2ఏ లాంగ్వేజ్‌‌లో తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, ఉర్దూ, సంస్కృతం పరీక్షల్ని నిర్వహిస్తారు. అక్టోబర్ 3న రెండో సెషన్‌లో పేపర్‌ 2ఏలో తెలుగు పరీక్ష జరుగుతుంది.

అక్టోబర్ 4వ తేదీన ఉదయం సెషన్‌లో పేపర్‌ 2ఏ తెలుగు, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌ 2ఏ ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుంది.

అక్టోబర్ 5న ఉదయం సెషన్‌లో పేపర్‌ 2ఏ ఇంగ్లీష్, పేపర్‌ 2ఏ హిందీ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌ 2ఏ హిందీ పరీక్ష నిర్వహిస్తారు.

అక్టోబర్ 6వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్‌ 1ఏ , 1బీ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 1ఏ పరీక్షను నిర్వహిస్తారు.

అక్టోబర్ 7, 8, 9, 10 తేదీలలో రెండు సెషన్లలో ఎస్జీటీ పేపర్ 1ఏ పరీక్షలు జరుగతాయి.

అక్టోబర్ 11, 12 తేదీలలో సెలవులు ఉంటాయి.

అక్టోబర్ 13న ఉదయం సెషన్‌లో ఎస్జీటీ పేపర్‌ 1ఏ, మధ్యాహ్నం ఎస్జీటీ 1ఏ తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, సంస్క్రతం పరీక్షలు నిర్వహిస్తారు.

అక్టోబర్‌ 14న ఎస్జీటీ 1ఏ తెలుగు, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ మ్యాథ్స్, సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి.

అక్టోబర్ 15న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పేపర్ 2ఏ మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

అక్టోబర్ 16వ తేదీ ఉదయం పేపర్‌ 2ఏ మ్యాథమెటిక్స్‌, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్, ఇంగ్లీష్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

అక్టోబర్ 17వ తేదీన రెండు సెషన్లలో పేపర్ 2ఏలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి.

అక్టోబర్ 18న పేపర్ 2ఏ ఉదయం సెషన్‌లో మ్యాథ్స్‌, మధ్యాహ్నం సోషల్ పరీక్షలు జరుగుతాయి. 19వ తేదీన ఉదయం, సాయంత్రం పేపర్ 2ఏ సోషల్ పరీక్షలు నిర్వహిస్తారు.

అక్టోబర్ 20న పేపర్‌ 2ఏ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, ఇంగ్లీష్‌, మధ్యాహ్నం సెషన్‌లో సోషల్ పరీక్షలు నిర్వహిస్తారు.

అక్టోబర్‌ 21వ తేదీ ఉదయం సోషల్‌ పరీక్షను మధ్యాహ్నం పేపర్ 2బి పరీక్షను నిర్వహిస్తారు.

ఒకే రోజు రెండు పరీక్షలు…

టెట్‌ పరీక్షల హాల్‌ టిక్కెట్ల జారీలో పలు లోపాలు వెలుగు చూశాయి. పలువురు అభ్యర్థులు సెకండరీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించే క్రమంలో వేర్వేరుగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఒకే రోజు రెండు పరీక్షల హాల్‌ టిక్కెట్లను జారీ చేశారు. కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిం చడంతో ఒక పరీక్షకు మాత్రమే హాజరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

ఒకే నగరంలో కూడా కాకుండా జిల్లాలు మార్చి పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో ఏదో ఒక్క పరీక్షకు మాత్రమే హాజరయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి టెట్ పరీక్షల్లో ఈ తరహా ఘటనలు వెలుగు చూశాయి. ఒకే రోజు ఒకే సమయంలో వేర్వేరు పరీక్షల హాల్‌ టిక్కెట్లను కూడా కొందరికి జారీ చేశారు. ఇలాంటి వారికి రెండు పరీక్షలకు హాజరయ్యేలా వేర్వేరు తేదీలను కేటాయించాలని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించటానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు దాదాపు నాలుగు లక్షలు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలుగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మాక్ టెస్ట్- నమూనా పరీక్ష పత్రాలను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

https://cse.ap.gov.in/ లో అందుబాటులో మాక్‌టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావొచ్చు.దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్లలో నమూనా పరీక్ష పత్రాలను ప్రాక్టీస్ చేయవచ్చు.

ఏపీ టెట్(TET) పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. టెట్ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి టెట్ పరీక్షలకు 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్‌ లో మాక్‌ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి.