Maredumilli Accident: జలపాతంలో కొట్టుకుపోయిన వైద్య విద్యార్థులు, ఒక్కసారిగా పెరిగిన ఉధృతిలో ముగ్గురి గల్లంతు
Maredumilli Accident: విహార యాత్రకు వచ్చిన వైద్య విద్యార్థులు జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతిలో కొట్టుకుపోయిన ఘటన మారేడుమిల్లిలో జరిగింది.ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ స్టూడెంట్స్ కొట్టుకుపోగా ఇద్దరిని ఒడిశాకు చెందిన యువకులు కాపాడారు.ముగ్గురు గల్లంతయ్యారు.
Maredumilli Accident: వైద్య విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. ట్రావెల్ వాహనంలో జలపాతం వద్దకు విహార యాత్రకు వచ్చిన సెకండియర్ ఎంబిబిఎస్ విద్యార్థుల్లో ఐదుగురు కొట్టుకుపోగా అక్కడే ఉన్న ఒడిశా యువకులు ఇద్దరిని కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రికి తరలించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలోని జలతరంగిణి జలపాతంలో ఆదివారం ఐదుగురు వైద్య విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని ఒడిశాకు చెందిన యువకులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువుతున్న 13 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చారు. అక్కడ ఉన్న జలపాతంలో ఉత్సాహంగా దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహించి అయిదుగురు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరిని అక్కడున్నవారు కాపా డగా.. ముగ్గురు గల్లంతయ్యారు.
ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువు తున్న 14 మంది వైద్యవిద్యార్థులు ట్రావెలర్ వాహనంలో ఆదివారం వచ్చారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్ళే ఉన్న 'జలతరంగిణి' జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్క సారిగా భారీవర్షం కురిసింది. జలపాతంలో ఉద్ధృతి పెరగడంతో అయిదుగురు కొట్టుకుపోయారు. అందులో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, పుష్ప అనేఇద్దరిని ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన యువకులు కాపాడారు. వారిని రంపచోడవరం ప్రాంతీయ ఆసుప త్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు.
గల్లంతైన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీహెచ్ హరదీప్ (20), విజయనగరానికి చెందిన కోసిరెడ్డి సౌమ్య (21), బాపట్లకు చెందిన బి. అమృత (21) ఉన్నారు. గల్లంతైన వారి కోసం రంపచోడవరం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
జల తరంగిణి జలపాతం వద్దకు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వర్షం పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అప్పటికే ఎగువ ప్రాంతాల్లో వర్షం కురవడంతో కొండలపై నుంచి వర్షపు నీరు ఉధృతంగా రావడంతో విద్యార్థులందరూ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా వారిలో గాయత్రి పుష్ప, చింతా హరిణి ప్రియ, కె.సౌమ్య, బి.అమృత, సీహెచ్ హరదీప్ కాలవలోకి కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రి ప్రియ, హరిణిలను సమీపంలోని కాజ్‌వే వద్ద సిమెంట్ తూరల్లో చిక్కుకుపోయారు. గల్లంతైన ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన చింతకుంట హరదీప్(20), విజయనగరం జిల్లాకు చెందిన కొసిరెడ్డి సౌమ్య(21), బాలి అమృత (22) కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మారేడుమిల్లిలో వర్షం ఎక్కువగా కురుస్తుండడం.. చీకటిపడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సింహాచలం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై మారేడుమిల్లి పోలీ్‌సస్టేషన్‌లో సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు,.