CM Chandrababu : జూనియర్ న్యాయవాదులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, నెలరు రూ.10 వేలు గౌరవ వేతనం-amaravati cm chandrababu says high court bench at kurnool 10k financial aide for junior lawyers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : జూనియర్ న్యాయవాదులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, నెలరు రూ.10 వేలు గౌరవ వేతనం

CM Chandrababu : జూనియర్ న్యాయవాదులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, నెలరు రూ.10 వేలు గౌరవ వేతనం

Bandaru Satyaprasad HT Telugu
Sep 23, 2024 06:53 PM IST

CM Chandrababu : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.

జూనియర్ న్యాయవాదులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, నెలరు రూ.10 వేలు ఆర్థిక సాయం
జూనియర్ న్యాయవాదులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, నెలరు రూ.10 వేలు ఆర్థిక సాయం

CM Chandrababu : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో న్యాయ‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మైనార్టీ పథకాలు రీస్ట్రక్టర్

ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మైనారిటీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలన్నారు. మైనారిటీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, అధికారులు పాల్గొన్నారు.

ముస్లిం మైనారిటీలకు గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలన్నారు.

కడప హజ్‌ హౌస్‌, గుంటూరు క్రిస్టియన్‌ భవన్‌ను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూర్‌ బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మైనార్టీలకు లబ్ధి చేకూర్చేలా వక్ఫ్‌ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సంబంధిత కథనం