LIVE UPDATES
AP TET Hall Tickets 2024 : అలర్ట్... ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Andhra Pradesh News Live September 21, 2024: AP TET Hall Tickets 2024 : అలర్ట్... ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
21 September 2024, 22:42 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: AP TET Hall Tickets 2024 : అలర్ట్... ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- AP TET Hall Tickets Download 2024 : ఏపీ టెట్ - 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. నవంబర్ 2వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
Andhra Pradesh News Live: AP Sachivayalas Employees : సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబర్ 26 వరకు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు
- AP Sachivayalas Employees : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ నెల 26 వరకు బదిలీలు నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పూర్తయ్యే వరకు బదిలీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Andhra Pradesh News Live: Pawan Kalyan : ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష
- Pawan Kalyan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వికృత చర్యల ఫలితంగా తిరుమల లడ్డూ ప్రసాదం అపవత్రమైందని పవన్ అన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు.
Andhra Pradesh News Live: Vijaya Dairy Letter To TTD : టీటీడీకి నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడానికి సిద్ధం, తెలంగాణ విజయ డెయిరీ లేఖ
- Vijaya Dairy Letter To TTD : టీటీడీకి నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ విజయ డెయిరీ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవోకు లేఖ రాశారు. టీటీడీకి నాణ్యమైన నెయ్యి, పాల ఉత్పత్తులు అందించడానికి విజయ డెయిరీ సంసిద్ధత వ్యక్తం చేసింది.
Andhra Pradesh News Live: AP Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో
- AP Heavy Rain Alert : బంగాళాఖాతంలో ఎల్లుండి(సెప్టెంబర్ 23) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది.
Andhra Pradesh News Live: AP Student Died In Bihar : పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య, నిట్ డైరెక్టర్ రాజీనామాకు విద్యార్థుల డిమాండ్
- AP Student Died In Bihar : అనంతపురం జిల్లాకు చెందిన యువతి బీహర్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో చదువుతోంది. అయితే శుక్రవారం రాత్రి ఏపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వ్యవహారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Andhra Pradesh News Live: Kotabommali Kothammatalli Jatara : ఉత్తరాంధ్ర కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి, అక్టోబర్ 1 నుంచి 3 వరకు మహా జాతర
- Kotabommali Kothammatalli Jatara : శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరను అక్టోబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారు. ఈ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
Andhra Pradesh News Live: Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్ H సక్సెస్.. మూడో బోటును బయటకు తీసిన ఇంజనీర్లు
- Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్ H సక్సెస్ అయ్యింది. విజయవంతంగా మూడో బోటును బయటకు తీశారు ఇంజనీర్లు. రెండు వారాలుగా బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగింది. ఇక బ్యారేజీ మెయింటెన్స్‌ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు.
Andhra Pradesh News Live: YSRCP : వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మరో కీలక నేత.. ఆ నియోజకవర్గంలో దిక్కెవరు?
- YSRCP : వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీకి రాంరాం చెప్పగా.. తాజాగా మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ నియోజవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ జరుగుతోంది.
Andhra Pradesh News Live: Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టులు, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
- Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీలో 200, తెలంగాణలో 120 ఖాళీలున్నాయి.
Andhra Pradesh News Live: Vijayawada : 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.. సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్
- Vijayawada : 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యం అని.. మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
Andhra Pradesh News Live: AP Sachivalayam Employees : వాలంటీర్ల అవతారమెత్తిన సచివాలయ ఉద్యోగులు, ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు
- AP Sachivalayam Employees : ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికిస్తున్నారు. వాలంటీర్లతో చేయించాల్సిన పనులు తమతో చేయిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
Andhra Pradesh News Live: Tirumala Laddu Issue : లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం.. చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్న ఈవో
- Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. చంద్రబాబు కామెంట్స్‌తో మొదలైన లడ్డూ వివాదం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా.. లడ్డూ వివాదంపై టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ సలహాదారులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. దీనిపై ఈవో చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు.
Andhra Pradesh News Live: AP Old Liquor Brands : మందుబాబులకు కూల్ న్యూస్, పాత బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్!
- AP Old Liquor Brands : మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం వరుస తీపికబుర్లు చెబుతోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా పాత బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచనున్నారు. మద్యం ధరలు సైతం తగ్గనున్నాయి.
Andhra Pradesh News Live: Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే
- Health Insurance : ప్రస్తుత కాలంలో ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. ఊహించని ఆరోగ్య సమస్యలు మనల్ని ఆర్థికంగా కుంగదీయకుండా ఆరోగ్య బీమా కాపాడుతోంది. అయితే ఆరోగ్య బీమా ఎంచుకునేటప్పుడు పలు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
Andhra Pradesh News Live: Govt Jobs 2024 : ఏపీ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 125 ఖాళీలు, దరఖాస్తులకు అక్టోబర్ 10 ఆఖరు తేదీ
- NIT AP Recruitment 2024 : టీచింగ్ పోస్టుల భర్తీకి ఏపీలోని నిట్(NIT) నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల పోస్టులు కలిపి 125 ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు అక్టోబరు 10వ తేదీతో పూర్తి కానుంది. https://www.nitandhra.ac.in/main/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.
Andhra Pradesh News Live: AP Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్...! ఈనెల 23, 24 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు
- ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారం తేదీల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. సెప్టెంబర్ 23వ తేదీన పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
Andhra Pradesh News Live: YS Jagan Comments : వైసీపీ క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చిన జగన్ లాస్ట్ పంచ్.. కామెంట్స్ వైరల్
- YS Jagan Comments : వైసీపీ నుంచి వలసలు పెరిగాయి.. ఇక పార్టీలో ఎవరూ ఉండరు.. చాలామంది సీనియర్ లీడర్లు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారనే కామెంట్స్ వైసీపీ క్యాడర్‌ను ఇన్నాళ్లు భయపెట్టాయి. కానీ జగన్ ఒకే ఒక్క కామెంట్‌తో ఆ భయాన్ని పొగొట్టారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Andhra Pradesh News Live: Nellore Honor killing : నెల్లూరు జిల్లాలో పరువు హత్య.. కుమార్తెను కడతేర్చి.. పూడ్చిపెట్టిన తల్లిదండ్రులు
- Nellore Honor killing : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తాము చెప్పిన మాట వినకుండా, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కుమార్తెను చంపేశారు తల్లిదండ్రులు. ఇంటి సమీపంలోనే ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తమ బిడ్డ కనిపించడం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh News Live: Tirupati District : నోట్‌బుక్ తీసుకురాలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్ - వీపుపై వాతలు
- నోట్‌బుక్ తీసుకురాలేదన్న కారణంతో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో సదరు విద్యార్థి అక్కడకక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Andhra Pradesh News Live: AP TET Hall Tickets 2024 : రేపు ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - అక్టోబర్ 3 నుంచి పరీక్షలు
- AP TET Hall Tickets 2024: ఏపీ టెట్ - 2024 హాల్ టికెట్లు ఆదివారం (సెప్టెంబర్ 22) విడుదల కానున్నాయి. వీటిని టెట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్ లైన్ మాక్ టెస్ట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh News Live: Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు - వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు!
- ఏపీలో అధికార మార్పిడి తర్వాత విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడగా… మరో నలుగురు అదే బాటలో నడవనున్నారు. వీరు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.