YS Jagan Comments : వైసీపీ క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చిన జగన్.. సీమ యాసలో లాస్ట్ పంచ్.. కామెంట్స్ వైరల్
YS Jagan Comments : వైసీపీ నుంచి వలసలు పెరిగాయి.. ఇక పార్టీలో ఎవరూ ఉండరు.. చాలామంది సీనియర్ లీడర్లు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారనే కామెంట్స్ వైసీపీ క్యాడర్‌ను ఇన్నాళ్లు భయపెట్టాయి. కానీ జగన్ ఒకే ఒక్క కామెంట్‌తో ఆ భయాన్ని పొగొట్టారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల వైసీపీకి చెందిన సీనియర్ లీడర్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. అంతకు ముందు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా చాలామంది నేతలు వైసీపీ గోడ దూకడానికి రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక వైసీపీ పని అయిపోందనే కామెంట్స్.. ఆ పార్టీ క్యాడర్‌ను భయపెట్టాయి. కానీ.. జగన్ శుక్రవారం చేసిన కామెంట్స్.. వైసీపీ క్యాడర్‌కు ధైర్యాన్ని ఇచ్చాయి.
శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. అలాగే తిరుమల లడ్డూ, కల్తీ నెయ్యి వ్యవహారంపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ఇదే ప్రెస్‌మీట్ చివర్లో జర్నలిస్టులు జగన్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిల్లో ముఖ్యంగా సీనియర్ లీడర్లు పార్టీ మారుతున్నారు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. జగన్ తన స్టైల్‌లో ఆన్సర్ చెప్పారు. జగన్ చెప్పిన సమాధానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.
సీమ యాసలో..
'యా సీనియర్ లీడర్ పోయేది.. పోతే ఏమవుతుంది.. ఇంకొకరు వస్తారు.. లీడర్ అనేవాడు ప్రజల్లో నుంచి పుట్టాలి' అని జగన్ రాయలసీమ యాసలో వ్యాఖ్యానించారు. అంతే.. శుక్రవారం మాట్లాడిన ప్రెస్‌మీట్ అంశాలు అన్నీ పక్కకుపోయి.. జగన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా జగన్ చేసిన ఈ కామెంట్స్‌తో ఓ వీడియో ప్రిపేర్ చేసింది. దాన్ని వైసీపీ క్యాడర్ షేర్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల్లో జగన్ మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతోంది. జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వైసీపీలో ఇద్దరే శాశ్వతం..
గతంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాజీమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. 'వైసీపీలో ఇద్దరే శాశ్వతం.. లీడర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. జెండా మోసే కార్యకర్త, జగన్.. ఈ ఇద్దరే పార్టీలో పర్మనెంట్' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. నాని చేసిన ఈ కామెంట్స్, జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు జోడించి చేసిన వీడియోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. వైసీపీలో ఈ ఇద్దరే శాశ్వతం అని క్యాడర్ చెబుతున్నారు.
జగన్ మొండోడు..
జగన్ మొండోడు అని చాలామంది చెబుతుంటారు. తాజాగా పార్టీ మారుతున్న లీడర్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కూడా జగన్ మొండోడు అనే మాటలకు బలం చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 'జగన్ ఆలోచనలను అందుకోవడం ఎవరికి సాధ్యం కాదు..జగన్ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. రాజకీయంగా నష్టం తప్పదు' అని టీడీపీకి చెందిన సీనియర్ నేతలు కూడా చెబుతారు. మొత్తానికి జగన్ చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు వైసీపీలో జోష్ నింపిందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా జగన్ తీసుకునే తర్వాతి స్టెప్ ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.