Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే
Health Insurance : ప్రస్తుత కాలంలో ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. ఊహించని ఆరోగ్య సమస్యలు మనల్ని ఆర్థికంగా కుంగదీయకుండా ఆరోగ్య బీమా కాపాడుతోంది. అయితే ఆరోగ్య బీమా ఎంచుకునేటప్పుడు పలు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
Health Insurance : వైద్య ఖర్చులు మన సేవింగ్స్ ను ఇట్టే కరిగించేస్తాయి. అందుకే ఇటీవల కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. ఆరోగ్య బీమా పాలసీలు వైద్య ఖర్చును కవర్ చేయడంలో చాలా సహాయపడతాయి. ఇందులో వైద్య బిల్లులు, ప్రిస్క్రిప్షన్ మందులు, చికిత్సల ఖర్చులు కవర్ అవుతాయి. ఆరోగ్య బీమా వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. మీరు ఊహించని ఆరోగ్య సంక్షోభం నుంచి మిమల్ని రక్షించేందుకు ఆరోగ్య బీమా ఎంతో గానే ఉపయోగపడుతుంది.
చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకునేది వారు అనారోగ్యం పాలైనప్పుడు లేదా ప్రమాదానికి గురైన సమయంలో వైద్య ఖర్చుల కోసం జేబులోంచి చెల్లించాల్సిన అవసరం ఉండకూడదనే ఆలోచనతో. అయితే ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీలు ఇతరుల కంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందిస్తున్నాయి. కొన్ని ప్లాన్ లు ఔట్ పేషెంట్ సేవలను కూడా అందిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ప్రిస్క్రిప్షన్ డ్రగ్ కవరేజీని కూడా అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు డెంటల్, హియరింగ్ బీమా కవరేజీని కూడా అందిస్తున్నాయి. ఈ రకమైన కవరేజీ ప్లాన్ ఎంపిక సమయంలో ఇచ్చే రైడర్ల మీద ఆధారపడి ఉంటాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకునే ముందు పరిగణించాల్సిన అంశాలు
వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో జబ్బులేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ప్రతి మనిషిలో ఏదొక ఆరోగ్య సమస్య ఉంటుంది. అందుకే వైద్య ఖర్చులు భారం కాకుండా ఆరోగ్య బీమా తీసుకోవడం చాలా ముఖ్యం.
క్లెయిమ్ ప్రాసెస్
క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు మీరు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడంలో క్లెయిమ్ ప్రక్రియ ఒక ముఖ్యమైన భాగం. ముందుగా ప్రతి కంపెనీ క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఏ కంపెనీ క్లెయిమ్‌లను త్వరగా, సమర్ధవంతంగా ప్రాసెస్ చేస్తుందో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. కారణాలు చెప్పకుండా క్లెయిమ్ ప్రాసెస్ ను సులభంగా, వీలైనంత త్వరగా క్లెయిమ్‌ను చెల్లించే కంపెనీని గుర్తించి, పాలసీ తీసుకోవడం మంచిది.
బీమా మొత్తం
ఆరోగ్య బీమా ప్లాన్‌లో ఎంత కవరేజీ లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. వయస్సు, ఆరోగ్య సమస్యలు ఇలా పలు అంశాల ఆధారంగా బీమా మొత్తం మారవచ్చు. మీ ప్రీమియంను బట్టి పొందే కవరేజీ మొత్తం మారుతుంటుంది. మీ కుటుంబం అవసరాలకు తగిన విధంగా కవరేజీని ఎంపిక చేసుకోవాలి. ఎంత వరకు వైద్య ఖర్చులను కవర్ చేస్తారో తెలుసుకోవాలి.
లైఫ్ టైమ్ రెన్యువల్
చాలా బీమా కంపెనీలు లైఫ్ టైమ్ రెన్యువల్ పాలసీలు అందిస్తాయి. అంటే మీరు ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. మీ ప్రీమియంపై డబ్బు ఆదా చేయడంలో ఈ ప్లాన్‌ల ఫీచర్లు ఉపయోగపడతాయి.
నెట్‌వర్క్ హాస్పిటల్స్
బీమా ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు మీరు పరిగణించవలసిన మరో అంశం ఏమిటంటే హాస్పిటల్ నెట్‌వర్క్. మీరు ఎంచుకునే బీమా కంపెనీకి మీ ప్రాంతంలోని అన్ని ప్రధాన ఆసుపత్రులు నెట్ వర్క్ లో ఉన్నాయో లేదా అనేది విచారించండి. అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలకు సమయం చాలా ముఖ్యం. అందుకే మనకు దగ్గర్లోని ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా ఉండేది తగిన బీమా కంపెనీలను ఎంచుకోవాలి.
2024లో 5 బెస్ట్ ఆరోగ్య బీమా పాలసీలు
1. మాక్స్ బుపా హెల్త్ కంపానియన్ ప్లాన్
2. అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రిస్టోర్ హెల్త్
3. సిగ్నా టీటీకే ప్రోహెల్త్ ప్లస్
4.రాయల్ సుందరం హెల్త్ లైఫ్‌లైన్ సుప్రీం
5. ఆదిత్య బిర్లా యాక్టివ్ అష్యూర్ డైమండ్ ప్లాన్
Disclaimer : ఈ ఆర్టికల్ మీ అవగాహన కోసం ఇంటర్నెట్ ఆధారిత సమాచారంతో అందిస్తున్నాము. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేముందు ఆ రంగంలో నిపుణులను సంప్రదించండి.
సంబంధిత కథనం