AP Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్...! ఈనెల 23, 24 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు-heavy rains are likely in ap on september 23 and 24 imd latest weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్...! ఈనెల 23, 24 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు

AP Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్...! ఈనెల 23, 24 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 21, 2024 10:45 AM IST

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారం తేదీల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. సెప్టెంబర్ 23వ తేదీన పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీకి వర్ష సూచన..!
ఏపీకి వర్ష సూచన..! (image source from @APSDMA)

నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. సెప్టెంబర్ 23 నుంచి పశ్చి మ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణ ఉండొచ్చని అంచనా వేసింది. మరోవైపు సెప్టెంబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో వాయు తుఫాన్ సర్కులేషన్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

23న అల్పపీడనం..!

ఇది వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులెటిన్ లో తెలిపింది. ఆ తర్వాత దీని ప్రభావంతో వాయువ్య అనుకొని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం మీదుగా సెప్టెంబర్ 23వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురువొచ్చని, ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేసింది.దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని వివరించింది. బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పింది.

సోమ, మంగళవారం భారీ వర్షాలు…!

పశ్చిమ బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో సోమ, మంగళవారం(సెప్టెంబర్ 23, 24) తేదీల్లో ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ అంచనాల ప్రకారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది.

ఇక ఇవాళ (సెప్టెంబర్ 21) చూస్తే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీశైలానికి పెరిగిన వరద:

మరోవైపు శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద పెరిగింది. తాాజా వివరాల ప్రకారం… ప్రాజెక్టుకు వచ్చే ఇన్ ఫ్లో 17,706 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 37,116 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 877.50 అడుగులుగా ఉంది. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.  ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.