LIVE UPDATES
AP Paddy procurement : అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు - 48 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు
Andhra Pradesh News Live September 20, 2024: AP Paddy procurement : అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు - 48 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు
20 September 2024, 19:13 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: AP Paddy procurement : అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు - 48 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు
- రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని చెప్పారు.
Andhra Pradesh News Live: Special Trains : టూరిస్టులకు గుడ్‌న్యూస్.. అరకుకు రెండు స్పెషల్ రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
- Special Trains : అరకు టూరిస్టులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. టూరిస్ట్ రద్దీని క్లియర్ చేయడానికి అరకుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం- అరకు- విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Andhra Pradesh News Live: Tirupati Laddu Controversy : తిరుపతి లడ్డూ వివాదం - సమగ్ర నివేదిక కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ
- తిరుపతి లడ్డూ కల్తీపై జరుగుతున్న వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ విషయంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
Andhra Pradesh News Live: Army Recruitment : కడపలో నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
- Indian Army Agniveer Recruitment 2024 : కడపలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.నవంబర్ 15వ తేదీన ర్యాలీ ముగుస్తుందని ప్రకటించారు. ఏర్పాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Andhra Pradesh News Live: Tirumala Laddu : మరీ ఇంత దుర్మార్గమా.. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వాడుకుంటారా? : వైఎస్ జగన్
- Tirumala Laddu : తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే.. కల్తీ నెయ్యి అంటూ డ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh News Live: Tirupati Laddu : కేజీ ఆవు నెయ్యి రూ. 320కే ఎలా వస్తుంది! ఈ డౌట్ తోనే టెస్టింగ్ చేయించాం - కీలక విషయాలు చెప్పిన TTD ఈవో
- తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో కీలక విషయాలు చెప్పారు. తక్కువ రేటుకే నెయ్యిని సప్లై చేస్తున్నారంటేనే అనుమానపడ్డామని అన్నారు. ఈ డౌట్ తోనే శాంపిల్స్ టెస్టుకు పంపామని అన్నారు. ఈ నివేదికలో కల్తీ జరిగినట్లు తేలిందని వెల్లడించారు.
Andhra Pradesh News Live: Tirumala Laddu : చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!
- Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రసాదంలో కల్తీతోపాటు జరుగుతున్న అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. చంద్రబాబుకు లేఖ రాశారు.
Andhra Pradesh News Live: Kurnool Vijayawda Train: కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వే మంత్రిని కోరిన టీజీ భరత్
- Kurnool Vijayawda Train: కర్నూలు నుంచి విజయవాడ నగరానికి డైరెక్ట్ ట్రైన్ సదుపాయం కల్పించాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు,.
Andhra Pradesh News Live: Canada Student Permits: విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు తగ్గించిన కెనడా, భారతీయ విద్యార్థులపై ప్రభావం
Canada Student Permits: ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు స్టడీ పర్మిట్ల సంఖ్యలో కోత విధిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడా వెళుతుంటారు. పర్మిట్ల కొతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
Andhra Pradesh News Live: Anna Canteen Opening : అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం.. కత్తెర కోసం కొట్టుకున్న కూటమి నేతలు!
- Anna Canteen Opening : ఏపీలో అక్కడక్కడా కూటమి నేతల మధ్య ఫైటింగ్ జరుగుతోంది. తాజాగా.. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేయడానికి నేతలు వచ్చారు. ఈ సమయంలో కత్తెర కోసం కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ సెటైర్లు వేస్తోంది.
Andhra Pradesh News Live: Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన షర్మిల.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
- Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం.. ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్‌లోకి తాజాగా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. తిరుమలను అపవిత్రం చేస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh News Live: TTD Ghee Price Issue: ఆవునెయ్యి అంత చౌకగా ఎలా.. ఆ ధరకు సరఫరా సాధ్యమేనా? నెయ్యి కాంట్రాక్టుల్లో మర్మం ఏమిటి?
- TTD Ghee Price Issue: కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగిస్తున్న ఆవు నెయ్యి కల్తీపై ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా ప్రశ్నల్ని లేవనెత్తాయి. టీటీడీకి కారుచౌకగా ఆవు నెయ్యి సరఫరా జరుగుతున్న వైనాన్ని బయటపెట్టింది.
Andhra Pradesh News Live: Kethireddy Venkatarami Reddy : పదవుల కోసం రాలేదు.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటా: కేతిరెడ్డి
- Kethireddy Venkatarami Reddy : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. ఇన్నాళ్లు వైసీపీలో కొనసాగిన ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు కేతిరెడ్డి. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
Andhra Pradesh News Live: YSRCP Petition: లడ్డూ ప్రసాదాల వ్యవహారంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్, న్యాయవిచారణకు ఆదేశించాలని వినతి
- YSRCP Petition: తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైవీ సుబ్బారెడ్డి తరపున ఏపీ హైకోర్టులో మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Andhra Pradesh News Live: Pawan on TTD: సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలంటున్నడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏ ప్రమాణానికైనా సిద్ధమన్న లోకేష్
- Pawan on TTD: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జాతీయ స్థాయిలో సనాతన దర్మపరిరక్షణ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అక్రమాలపై కఠిన చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Andhra Pradesh News Live: Operation Budameru: ఆపరేషన్ బుడమేరుకు యాక్షన్ ప్లాన్ .. ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నయాలపై కసరత్తు…
- Operation Budameru: విజయవాడ నగరాన్ని ముంపుకు గురి చేసిన బుడమేరు ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఆక్రమణల పాలైన బుడమేరు ప్రవాహ మార్గాన్ని సరిచేసి వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది.
Andhra Pradesh News Live: Kakinada : గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు బాలికలు అరెస్టు.. రెండు బ్యాగుల్లో 30 కిలోలు!
- Kakinada : కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఇద్దరు బాలికలు అరెస్టు అయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గంజాయి తరలింపు కేసులో బాలికలు ఉండటంతో చర్చానీయాంశం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి.. వారిని జువైనల్ హోంకు తరలించారు.
Andhra Pradesh News Live: AP Welfare Pensions: అసలైన అర్హులకే సామాజిక పెన్షన్లు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్
- AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్ల తనిఖీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నారనే సమాచారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అర్హులకే పెన్షన్లుఅందించేందుకు సిద్ధం అవుతోంది. దీని కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.