Canada Student Permits: విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు తగ్గించిన కెనడా, భారతీయ విద్యార్థులపై ప్రభావం
Canada Student Permits: ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు స్టడీ పర్మిట్ల సంఖ్యలో కోత విధిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడా వెళుతుంటారు. పర్మిట్ల కొతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
Canada Student Permits: కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తోన్న విద్యార్థులకు ఆ దేశం షాక్ ఇచ్చింది. ఈ ఏడాది విదేశీ విద్యార్ధులకు 35 శాతం తక్కువ స్టూడెంట్ పర్మిట్లను మంజూరు చేస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. వచ్చే ఏడాది ఆ సంఖ్య మరో 10 శాతం తగ్గనుంది.
"ఇమ్మిగ్రేషన్ కెనడా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రయోజనం - కానీ చెడ్డ వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేసినప్పుడు , విద్యార్థులను సద్వినియోగం చేసుకోనపుడు ఆంక్షలు తప్పవని ప్రకటించారు.
కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించాలని కెనడా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ విద్యార్థులకు అత్యంత డిమాండ్ ఉన్న గమ్యస్థానాల్లో కెనడా ఒకటి.
ట్రూడో ప్రకటన కెనడాలో చదువుకోవాలనుకునే పలువురు భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒట్టావాలోని భారత హైకమిషన్ వెబ్సైట్ ప్రకారం, భారతదేశం మరియు కెనడా మధ్య పరస్పర ఆసక్తి ఉన్న కీలక రంగం విద్య. ప్రస్తుతం 4,27,000 మంది భారతీయ విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు.
వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. కెనడా స్టూడెంట్ వీసాల సంఖ్యను కుదించడంతో భారతీయ విద్యార్ధుల విదేవీ విద్యాభ్యాసం కలలపై పడుతుంది.