Special Trains : టూరిస్టులకు గుడ్‌న్యూస్.. అరకుకు రెండు స్పెషల్ రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
Special Trains : అరకు టూరిస్టులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. టూరిస్ట్ రద్దీని క్లియర్ చేయడానికి అరకుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం- అరకు- విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం- అరకు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08525) రైలు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది, ఇది అరకుకు ఉదయం 11:30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 11 ట్రిప్పులు ప్రయాణిస్తుంది. అరకు- విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08526) రైలు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అరకులో మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది విశాఖపట్నం సాయంత్రం 6:00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 11 ట్రిప్పులు ప్రయాణిస్తుంది.
ఈ రైలు విశాఖపట్నం- అరకు మధ్య సింహాచలం, కొత్తవలస, శృంగవరపుకోట, బొర్రాగుహాల రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది. ఈ రైలుకు సెకెండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-1, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ బ్రేక్ వాన్ (దివ్యాంగజన్ ఫ్రెండ్లీ)-2 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ.. పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేర్ డివిజన్ కృషి చేసిందని.. ప్రజలు ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
విశాఖపట్నం- షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు..
దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం నుండి షాలిమార్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం– షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08508) రైలు అక్టోబర్ 1 నుండి నవంబర్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. షాలిమార్ నుండి బయలుదేరే షాలిమార్ - విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08507) రైలు అక్టోబర్ 2 నుండి నవంబర్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రైలు మొత్తం తొమ్మిది ట్రిప్పులు ప్రయాణిస్తుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం- షాలిమార్ మధ్య సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్- కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచ్చి స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైలులో సెకెండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ -3, స్లీపర్-9, జనరల్ సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-1, మోటార్ కార్-1 ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)