Food Delivery: ఇకపై ట్రైన్లో మీరు ఉన్నచోటకే జొమాటో ఆర్డర్ వచ్చేస్తుంది, రైల్వే స్టేషన్లో ఉండి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు
ఇకపై రైల్వే స్టేషన్లో ఉండి కూడా జొమాటో ఆర్డర్ పెట్టుకోవచ్చు. రైలు టైమ్ గడుస్తున్న కూడా వండి డబ్బాల్లో ఆహారం పెట్టుకోవాల్సిన అవసరం ఇక లేదు. దేశంలో 100కు పైగా రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం జొమాటో సేవలు అందిస్తోంది.
Zomato Food Delivery: జొమాటోతో ఐఆర్‌సిటీసీ కలిసి ప్రయాణికులకు మరింత అనువైన, సులభతరమైన ప్రయాణాన్ని అందించబోతున్నాయి. ప్రయాణంలో ఆహారం ముఖ్యమైన భాగం. కొంతమంది ఇంటి దగ్గర వండుకుని తీసుకురాలేక, స్టేషన్లోనే కొనుక్కుంటూ ఉంటారు. ఇకపై మీకు నచ్చిన హోటల్ నుంచి జొమాటోకు ఆర్డర్ ఇచ్చి స్టేషన్ లోపలికి కూడా ఆర్డర్ అందుకోవచ్చు. అలాగే ట్రైన్లో మీరు ఉన్న బెర్త్ దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఐఆర్‌సిటిసీ అందిస్తోంది.
ఐఆర్‌సిటిసి, జొమోటోతో చేతులు కలిపి రైలు ప్రయాణికులకు రైల్వే స్టేషన్లోనూ, ట్రైన్లో తమ సీట్ల వద్దకు కూడా ఆహారాన్ని డెలివరీ చేసే అవకాశాన్ని అందించబోతుంది. రైల్వే ప్లాట్‌ఫారంపై ఉండి కూడా జొమాటో ఆర్డర్ పెట్టుకోవచ్చు. భారతదేశంలోని అనేక నగరాల్లో త్వరలో జొమాటో ఫుడ్ డెలివరీ రైల్వే స్టేషన్లకు కూడా ప్రారంభం అవ్వబోతోంది.
ఇప్పటికే జొమాటో సేవలు కొన్ని రైల్వే స్టేషన్లకు చేరాయి. పదిలక్షల మంది రైలు కోసం ఎదురు చూస్తూ జొమాటో ఆర్డర్లను పెట్టుకున్నారు. జొమాటో ప్రస్తుతం మన దేశంలో 88 నగరాల్లో అందుబాటులో ఉంది. రైలులో కూర్చుని లేదా రైలు కోసం నడుస్తూ ప్లాట్ ఫారంపై ఉన్నప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. రైలు బయలుదేరకముందే ఆర్డర్ వచ్చేలా... దగ్గరలోనే రెస్టారెంట్లకు ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఉన్న బెర్తు దగ్గరికి ఇచ్చి జొమాటో డెలివరీ బాయ్ మీ ఆహారాన్ని అందిస్తాడు.
ఐఆర్‌సిటిసితో జొమాటోతో చేతులు కలిపిన విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిజానికి జొమోటో ఐఆర్సిటిసి కలిసి గత ఏడాదే పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలుపెట్టాయి. న్యూఢిల్లీ, కాపూర్, లక్నో, వారణాసి, ప్రయాగ్ రాజ్... ఈ రైల్వేస్టేషన్లో జొమాటో సేవలను ప్రారంభించారు. అక్కడి నుంచి విశేషమైన స్పందన రావడంతో ఈ సేవలు దేశం మొత్తానికి విస్తరించాలని ఐఆర్ సిటిసీ... జొమాటోను కోరింది. ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, నాగపూర్ వంటి పెద్ద రైల్వే స్టేషన్లతో పాటు చిన్న రైల్వే స్టేషన్లో కలిపి ప్రస్తుతం 100 కంటే ఎక్కువ స్టేషన్లలోనే జొమాటో తన సేవలను అందించడానికి అందుబాటులో ఉంది.
రైల్వే స్టేషన్లలో లేదా రైల్వే స్టేషన్ బయట దొరికే చిల్లర దుకాణాల్లోని ఆహారం తినలేక ఇబ్బంది పడేవారు... రైళ్లల్లో లభించే ఆహారాన్ని తినలేని వారు ఇలా జొమోటోను వాడుకొని తమకి ఇష్టమైన ఆహారాన్ని నేరుగా తమ బెర్త్ దగ్గరకి తెచ్చుకోవచ్చు. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఇకపై రైలు ప్రయాణాలకు బయలుదేరేముందు రెండు మూడు గంటల ముందే ఆహారాన్ని ఇంట్లో రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా జొమాటో ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది.