South Central Railway : దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు.. 18వ తేదీన ఆ రైళ్లు రద్దు
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు డివిజన్ మీదగా ప్రత్యేక రైలును నడపనున్నట్టు ప్రకటించింది.
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం వెల్లడించారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు ఈ నెల 10వ తేదీ శుక్రవారం నుంచి నడుస్తుంది. ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.55 గంటలకు హతియాలో బయలుదేరుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 5.30 గంటలకు గుంటూరుకు... ఆ తర్వాతి రోజున ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 08616 నంబర్ సికింద్రాబాద్-హతియా రైలు ప్రతి సోమవారం రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు హతియా స్టేషన్‌కు చేరుతుంది. డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం వెల్లడించారు.
లింగంపల్లి-విశాఖపట్నం 12806 నుంచి విజయవాడ-విశాఖపట్నం మీదుగా వెళ్లే రైలు ఈ నెల 18న తాత్కాలికంగా రద్దు చేశారు. విశాఖపట్నం-లింగంపల్లి మీదుగా విశాఖపట్నం-విజయవాడ 12805 నంబర్ రైలును తాత్కాలికంగా రద్దు చేశామని అధికారులు వెల్లడించారు.
సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
రైలు నెంబర్ 07287.. పూర్ణ-నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 9న దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ రైలు 12.45 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
రైలు నెంబర్ 07286.. నర్సాపూర్-పూర్ణ స్పెషల్ ట్రైన్ పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడె, మిర్యాలగూడ మీదుగా వెళ్తుంది. నల్గొండ, సికింద్రాబాద్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్ స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నెంబర్ 07287.. పూర్ణ-నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ నాందేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో తెలిపారు.