తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 5, 2024: Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన
Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన
Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Andhra Pradesh News Live October 5, 2024: Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

05 October 2024, 21:28 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

05 October 2024, 21:28 IST

Andhra Pradesh News Live: Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

  • Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా అవాస్తమని టీటీడీ పేర్కొంది. జెర్రి రూపు చెదరకుండా ఉండటాన్ని చూస్తుంటే సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా భావించాల్సి ఉందని టీటీడీ తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 19:49 IST

Andhra Pradesh News Live: AP Temples : పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు

  • AP Temples : అర్చకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయం లేని చిన్న ఆల‌యాల‌కు ధూప‌, దీప‌, నైవేద్యాల కోసం ప్రభుత్వ సాయం నెల‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7,000 అర్చకుడికి, రూ.3,000 ధూప‌, దీప‌, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 18:40 IST

Andhra Pradesh News Live: AP Govt Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీలపై సీఈవో నిషేధం, అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 నో ట్రాన్స్ ఫర్స్

  • AP Govt Employees Transfers : ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 10 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 18:11 IST

Andhra Pradesh News Live: Anantapur Crime : ఈ నూనె రాస్తే నొప్పులు మాయం, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ

  • Anantapur Crime : అనంతపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆయుర్వేద వైద్యం పేరిట వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ చేస్తున్నాడు. నొప్పులకు ఆయుర్వేదం నూనెలు ఇస్తానంటూ వృద్ధులను నమ్మించి, వారి ఒంటిపై ఉన్న బంగారం తొలగించి నూనె రాస్తాను. ఈ క్రమంలో ఆ బంగారంలో కొంత చోరీ చేస్తున్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 17:33 IST

Andhra Pradesh News Live: ONGC Apprentice : ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్-కాకినాడ, రాజమండ్రి పరిధిలో 129 ఖాళీలు

  • ONGC Apprentice Recruitment : ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాకినాడ, రాజమండ్రి పరిధిలో 129 ఖాళీలున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 16:26 IST

Andhra Pradesh News Live: JNVST Class 9 Inter Admissions : నవోదయ 9వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం-చివరి తేదీ అక్టోబర్ 30

  • JNVST Class 9 Inter Admissions : జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీ లోపు నవోదయ అధికారిక వెబ్ సైట్ లో www. navodaya.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 14:32 IST

Andhra Pradesh News Live: Biryani Offer : 3 రూపాయలకే బిర్యానీ, నిర్వాహకులకు చుక్కలు చూపించిన జనం!

  • Biryani Offer : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త ప్రారంభమైన ఓ హోటల్ రూ.3 బిర్యానీ అని ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు హోటల్ ముందు క్యూకట్టారు. జనం తాకిడిని ఊహించిన నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మూడు గంటలే ఆఫర్ పెట్టడంతో బిర్యానీ ప్రియులు నిరాశచెందారు.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 13:31 IST

Andhra Pradesh News Live: PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్, శిక్షణతో పాటు ఏడాదికి రూ.60 వేలు-దరఖాస్తు ఇలా

  •  PM Internship Scheme 2024 : ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్రం శ్రీకారం చుట్టింది. రూ.800 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.  అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 13:03 IST

Andhra Pradesh News Live: AP Rain ALERT : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్... రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన!

  • ఏపీకి ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల వానలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తాజా వెదర్ బులెటిన్ పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 12:53 IST

Andhra Pradesh News Live: TTD : టీటీడీకి ఇన్సూరెన్స్ ప‌రిహారం చెల్లించాల్సిందే.. కోర్టు ఆదేశం

  • TTD : తిరుమ‌ల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇన్సూరెన్స్ ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని క‌న్స్యూమ‌ర్ కోర్టు ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తం టీటీడీకి చెల్లించాల‌ని స్పష్టం చేసింది. టీటీడీ త‌ర‌పు న్యాయ‌వాది కె.రాజేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 10:41 IST

Andhra Pradesh News Live: CM CBN in Tirumala : తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి - సీఎం చంద్రబాబు

  • టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు.  కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 10:37 IST

Andhra Pradesh News Live: Prakasam District : సిమ్ కార్డును హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ల‌బోదిబోమంటున్న బాధితుడు

  • Prakasam District : ఫోన్ సిమ్ హ్యాక్ చేసి.. వారి బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నగదును కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో బాధితుడు ల‌బోదిబోమంటున్నాడు. రంగంలోకి దిగిన సైబ‌ర్ క్రైం పోలీసులు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దొంగనోట్ల ముఠా రెచ్చిపోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 8:12 IST

Andhra Pradesh News Live: Pawan Kalyan HT Interview : 'మీరు ఏపీ బాల్ ఠాక్రేనా..?' - కీలక ప్రశ్నలకు జనసేన అధినేత పవన్ చెప్పిన సమాధానాలివే

  • తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హిందూవులంతా ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. తాజా ప్రకటనలపై హిందుస్తామ్ టైమ్స్.. పవన్ ను ఇంటర్వూ చేసింది. పలు కీలక ప్రశ్నలకు జవాబులిచ్చారు.

     

పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 6:48 IST

Andhra Pradesh News Live: AP KGBV Recruitment 2024 : కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు - దరఖాస్తు తేదీలు, ముఖ్య వివరాలు

  •  రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఖాళీగా నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి చేసిన అప్లికేషన్లను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

05 October 2024, 5:00 IST

Andhra Pradesh News Live: Annapurna devi: శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి

  • Annapurna devi: దేవీ శరన్నవరాత్రుల్లో మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  క్రోధి నామసంవత్సరం  అశ్వయుజశుద్ధ తదియ అన్నపూర్ణా దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.వరుస సెలవులతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి