ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్) దేశవ్యాప్తంగా పలు సెక్టార్లలో ట్రేడ్, ఇతర విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ, స్టైఫండ్ ఇస్తారు. మొత్తం 2236... గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు వయోపరిమితి 25.10.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు అంటే అభ్యర్థి పుట్టిన తేదీ 25.10.2000 -25.10.2006 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులుకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
అప్రెంటిస్‌ల ఎంపిక అర్హత పరీక్షలో పొందిన మార్కులు ఆధారంగా ఉంటుంది. మెరిట్ తో పాటు కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లు అనుసరిస్తారు.
1. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 25 మధ్యలో ఓఎన్జీసీ వెబ్‌సైట్ www.ongcapprentices.ongc.co.in ను సందర్శించాలి.
2. ఈ పోర్టల్ లోని https://apprenticeshipindia.gov.in/ దీనిపై క్లిక్ చేయాలి.
3. అభ్యర్థులు టాప్ మెనూలోని సెర్చ్ కాలంలో ONGC వర్క్ సెంటర్ల గురించి సెర్చ్ చేయాలి. ఆ తర్వాత ప్రాథమిక వివరాలతో సైట్‌ను లాగిన్ చేయాలి.
4. ఈ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేయాలి.
5. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (BOAT) పోర్టల్ https://nats.education.gov.in లో ట్రేడ్ వివరాలను నమోదు చేయాలి.