RINL Apprentice Posts : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RINL Apprentice Posts : విశాఖ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. స్టైఫండ్ కూడా ఇస్తారు.
RINL Apprentice Posts : విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) (వైజాగ్ స్టీల్‌ప్లాంట్)లో 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గలవారు సెప్టెంబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆర్ఐఎన్ఎల్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 250 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో 200 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు కాగా, 50 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనింగ్ ఇస్తారు.
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి ఈ అప్రెంటీస్ ట్రైనింగ్‌కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు టీఏ (ట్రావెల్ అలవెన్స్), డీఏ ఇవ్వరు. శిక్షణ కాలంలో స్టైఫండ్ ఇస్తారు. ఈ అప్రెంటీస్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉంటే సెప్టెంబర్ 30లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్టైఫండ్...అర్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.8,000 స్టైఫండ్ ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లలో బీఈ, బీటెక్‌ను 2021, 2022, 2023, 2024ల్లో పూర్తి చేసివారు అర్హలు. అలాగే టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లలో డిప్లొమా ఇంజినీరింగ్ 2021, 2022, 2023, 2024ల్లో పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎంహెచ్ఆర్‌డీ నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్) పోర్టల్ https://www.mhrdnats.gov.in/ ( డైరెక్ట్ లింక్ https://portal1.mhrdnats.gov.in/boat/login/user_login.action ) లో రిజిస్టర్ అయి ఉండాలి.
బీఈ, బీటెక్‌ల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, సిరామిక్స్ బ్రాంచ్‌లను పూర్తి చేయాల్సి ఉంటంది. అలాగే డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సెరామిక్స్, మెటలర్జీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లను పూర్తి చేసి ఉండాలి.
రిజర్వేషన్లు
ఈ పోస్టుల భర్తీలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ రిజర్వేషన్లను అమలు చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో గూగుల్ ఫారం నింపి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
అకాడమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ నిర్ణయించి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన వారికి అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్, లేదా ఈ మెయిల్‌కు ఇంటర్వ్యూ తేదీ, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం వివరాలకు సంబంధించిన సమాచారం అందిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ఇతర ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్లలో పోస్టింగ్ ఉంటుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం