Visakhapatnam Naval Dockyard Jobs : ఇండియన్ నేవీ విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిట్టర్, మెకానిక్ (డీజిల్), ఎలక్ట్రీషియన్, పెయింటర్ (జనరల్), మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో మొత్తం 275 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 01, 2024గా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 28, 2024న రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా 70:30 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెరిట్ జాబితా రూపొందించి ఫలితాలు ప్రకటించారు.
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రకారం అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (MSDE) కోసం గరిష్ట వయోపరిమితి లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు కనిష్ట వయో పరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల కోసం, కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.
అభ్యర్థులు కనీసం 55% మొత్తంతో SSC/ మెట్రిక్యులేషన్ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 65 % మార్కులతో ITI (NCVT/SCVT) ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్‌లకు ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్ ఇస్తారు. నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.