ONGC Scholarships 2024 : విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ - నెలకు రూ. 4 వేలు, ఇలా దరఖాస్తు చేసుకోండి..!
విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ(ONGC) గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి రూ. 48 వేల స్కాలర్ షిప్ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన విద్యార్థులను వీటి కోసం ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు సెప్టెంబరు 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఏడాదికి రూ. 48 వేల స్కాలర్ షిప్ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు అప్లయ్ చేసుకోవాలని సూచించింది. మెరిట్ జాబితా ఆధారంగా తుది జాబితా ఉంటుందని పేర్కొంది.
మొత్తం 2 వేల మందికి…
ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది 2వేల మందికి స్కాలర్‌షిప్స్ ఇస్తారు. వీరిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 కేటాయించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం సెప్టెంబర్ 18వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు ఇందుకు అర్హులవుతారు. ఆగస్టు 01, 2024 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
ఈ స్కీమ్ లో భాగంగా ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఇస్తారు. అంటే ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది. కోర్సు వ్యవధిని బట్టి పూర్తయినంత వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. 2024-25 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. 60 శాతం ఉత్తీర్ణతతో పాసై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల లోపు ఉన్న అప్లయ్ చేసుకోవచ్చు.
5వ జోన్ లో ఏపీ, తెలంగాణ
ఈ స్కాలర్ షిప్స్ కోసం 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున ఎంపిక చేస్తారు. విద్యార్థులు చదివే కాలేజీ ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్ 5 పరిధిలో ఉన్నాయి. స్కాలర్‌షిప్ కు ఎంపికైన తర్వాత…. విద్యార్థి ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే పేరును తొలగిస్తారు.
ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ జియోలజీ, జియో ఫిజిక్స్ కోర్సులు చదివే వారికి మాత్రమే ఈ స్కాలర్ షిప్స్ అందజేస్తారు. వీటిల్లో 50 శాతం మహిళలకే రిజర్వ్ అయి ఉంటాయి.
దరఖాస్తు విధానం
- అర్హత ఉన్న అభ్యర్థులు www.ongcscholar.org వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ‘Apply Now’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీరు ఏ కేటగిరిలో దరఖాస్తు చేసుకోవాలో ఎంచుకోవాలి.
- మీ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
- అన్ని కాలమ్స్ పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- మీ మార్కులతో పాటు బీపీఎల్ కుటుంబాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఎంపిక చేస్తారు.
- ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
NOTE: ఈ లింక్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.