Reliance Scholarships : రిలయన్స్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయాలి-reliance foundation inviting applications for 5100 scholarships to first year under graduate and post graduate students ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Scholarships : రిలయన్స్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయాలి

Reliance Scholarships : రిలయన్స్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయాలి

Anand Sai HT Telugu
Aug 14, 2024 01:43 PM IST

Reliance Scholarships Application : ఇండియాలో అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25 సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనిలో భాగంగా 5100 మంది అండర్ గ్యాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంపిక చేయనుంది.

రిలయన్స్ స్కాలర్‌షిప్స్‌
రిలయన్స్ స్కాలర్‌షిప్స్‌ (Reliance Foundation)

భారతదేశంలోని 5,100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ ఇవ్వనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ప్రారంభించినట్లు ఫౌండేషన్ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్ కొన్నేళ్లుగా ఈ స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్‌ను కంటిన్యూ చేస్తోంది. పేద విద్యార్థులకు మద్దతు, ఆర్థిక సహకారంలో భాగంగా ఈ స్కాలర్‌షిప్స్ మంజూరు చేస్తారు. భారతదేశంలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల విద్యకు సంబంధించిన మెరిట్-కమ్-మీన్స్ ప్రమాణాల ఆధారంగా 5,000 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రదానం చేస్తారు. ఆర్థిక భారం లేకుండా చదువును కొనసాగించడానికి అవకాశం కల్పిస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్‌లలో ప్రతిభావంతులైన 100 విద్యార్థులను ఎంపిక చేసి ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 2 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 6 లక్షలుగా స్కాలర్‌షిప్ నిర్ణయించారు. ఇప్పటి వరకు రిలయన్స్ 23,000 ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లను అందించింది.

www.scholarships.reliancefoundation.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కోసం ఆప్టిట్యూడ్, ఆర్థిక నేపథ్యం గురించి చూస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం, అకడమిక్ అచీవ్‌మెంట్‌లు, వ్యక్తిగత వివరాలు, ఇంటర్వ్యూలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిభను గుర్తించడానికి ఎంపిక ప్రక్రియలో భాగం పోటీ కూడా ఉంటుంది. రిలయ్సన్స్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులకు చివరి తేదీ 6 అక్టోబర్ 2024గా నిర్ణయించారు.

దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మెుదటి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంది. పీజీ కోర్సులు చదివేవారికి కూడా స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో మరింత సమాచారం పొందవచ్చు.

Whats_app_banner