SVIMS Admissions: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 12 అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసేందుకు జూలై 22న నిర్ణయించింది.
స్విమ్స్‌లో మొత్తం 12 అండర్ గ్రాడ్యూయేట్ కోర్సులు ఉండగా, అందులో 228 సీట్లు ఉన్నాయి. కోర్సులను బట్టీ సీట్లు వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ-ఎన్) కోర్సులో 100 సీట్లు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సులో 50 సీట్లు, బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ (ఏటీ) కోర్సులో 12 సీట్లు, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ) కోర్సులో 20 సీట్లు, బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్ఐటీ) కోర్సులో 9 సీట్లు, బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్య్ఫూజన్ టెక్నాలజీ కోర్సులో 2 సీట్లు, బీఎస్సీ ఈసీజీ, కార్మియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సులో 8 సీట్లు, బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ) కోర్సులో 12 సీట్లు, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కోర్సులో 4 సీట్లు, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ కోర్సులో 4 సీట్లు, బీఎస్సీ రేడియోథెరఫీ టెక్నాలజీ (ఆర్‌టీ) కోర్సులో 5 సీట్లు, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ కోర్సులో 2 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు నాలుగున్నరేళ్లు కాగా, మిగిలిన 11 కోర్సులు నాలుగేళ్ల ఫుల్ టైమ్ కోర్సులు.
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంకు సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 17 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఏపీఈఏపీసెట్-2024 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
దరఖాస్తు చేసేందుకు అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.2,596 కాగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.2,077 ఉంది. ఫీజును ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://svimstpt.ap.nic.in లో అప్లికేషన్ దాఖలు చేయాలి. కౌన్సింగ్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, ఫీజు చెల్లించడం, అడ్మిషన్ పొందడానికి 2024 ఆగస్టు 13, ఆగస్టు 14 తేదీల్లో సాయంత్రం 4 గంటల లోపు యూనివర్శిటీలో రిపోర్టింగ్ చేయాలి.
అదనపు సమచారం కోసం సంప్రదించండిః
Please Contact : 91-9154114978
Academic Section –Enquiry
Mrs. G. Sailaja, Superintendent (Admissions)
Mr. G. Surendranath Reddy, Senior Assistant (Scholarships)
Contact numbers: 0877 – 2287777, Ext: 2458
e-mail ID : svimsadmissions@gmail.com
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)